ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టులో గ్రౌండ్‌లోనే కూలబడ్డాడు. వికెట్ల మధ్య చిరుతపులిలా పరుగులు తీసే వార్నర్‌ను ఈ పరిస్థితుల్లో చూసిన క్రికెట్ అభిమానులు వార్నర్‌కు ఏమైందో అని ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వేసవి కాలం కావడంతో.. ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆటగాళ్లు ఎండ వేడిమికి విలవిల్లాడిపోతున్నారు. వార్నర్ సైతం ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడంతో వేడికి తట్టుకోలేక ఆట మధ్యలో వచ్చిన బ్రేక్ సమయంలో కూర్చిలో కూలబడిపోయాడు. భరించలేని వేడికి తోడు.. అతని తొడ కండరాలు పట్టేయడంతో పరుగులు చేస్తున్నా.. వార్నర్ ఎంతో అలసిపోయాడు.
తొడ కండరాలు పట్టేసినా.. భరించలేని వేడిలోనూ రోజంతా బ్యాటింగ్ చేశాడు వార్నర్. కొంత కాలంగా టెస్టు క్రికెట్‌లో పెద్దగా ఫామ్‌లో లేని వార్నర్.. సెంచరీ చేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వేడి, నొప్పి లెక్కచేయకుండా.. బ్యాటింగ్ చేసిన వార్నర్.. సెంచరీతో కదం తొక్కాడు. పైగా ఇది వార్నర్‌కు వందో టెస్టు కావడంతో మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వార్నర్.. ఆ సెంచరీని కాస్త డబుల్ సెంచరీగా మలచి చరిత్ర సృష్టించాడు. వందో టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా, ఆస్ట్రేలియా నుంచి తొలి ప్లేయర్‌గా నిలిచాడు వార్నర్. వార్నర్ కంటే ముందు ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ తన వందో టెస్టులో డబుల్ సెంచరీ చేశాడు. మళ్లీ ఇప్పుడు వార్నర్ ఆ ఘనత సాధించాడు. అయితే.. 200 మార్క్ చేరుకోగానే మళ్లీ తొడ కండరాలు పట్టేయడంతో వార్నర్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 189 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరున్ గ్రీన్ 5 వికెట్లతో చెలరేగడంతో ప్రొటీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 67 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సౌతాఫ్రికా. కైల్ వెర్రెయిన్నే(52), మార్కో జాన్సన్(59) పరుగులతో దక్షిణాఫ్రికాను ఆదుకున్నారు. వారిద్దరు అవుట్ అయిన తర్వాత మళ్లీ వికెట్ పతనం మొదలైంది. దీంతో.. సౌతాఫ్రికా 189 రన్స్‌తోనే సరిపెట్టుకుంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 386 పరుగులు చేసింది. మరి ఈ మ్యాచ్‌లో వార్నర్ డబుల్ సెంచరీ, పడిన ఇబ్బందిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
David Warner looks like he’s about to head out for the 12th round v prime Mike Tyson 🥵 #AUSvSA pic.twitter.com/l9NCttRYCv
— 7Cricket (@7Cricket) December 27, 2022