బాగా ఆకలి మీదున్న పులి వేటకు వెళ్తే?.. ఆ రోజు ఎవరికో మూడిందని అర్థం. అవును ఇప్పుడు ఎగ్జాట్ గా అదే జరిగింది. సెంచరీ చేసి చాన్నాళ్లయింది. బ్యాట్ కు పనిచెప్పి కూడా చాలారోజులే అయిపోయింది. అందరూ తనపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఆసీస్ క్రికెట్ బోర్డుతో గొడవ. వీటన్నింటి మధ్య స్వదేశంలో బాక్సింగ్ డే టెస్టు. అది కూడా తన కెరీర్ లో 100వ టెస్టు. ఇక చెప్పేదేముంది. వార్నర్ రెచ్చిపోయాడు. బౌలర్లని చితక్కొట్టి సెంచరీ చేశాడు. గాల్లోకి ఎగిరి మరీ తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ చేశాడు. ఎప్పుడో 2020 జనవరిలో శతకం సాధించిన మనోడు.. మళ్లీ ఇన్నాళ్లకు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో జూలు విదిల్చాడు. 144 బంతుల్లో సెంచరీ చేసి విమర్శకుల నోళ్లు మూయించాడు. అయితే ఇక్కడ వార్నర్ సెంచరీ చేయడం విశేషం కాదు. ఇన్నాళ్ల తర్వాత శతకం చేసి పలు రికార్డులు నమోదు చేశాడు. మరీ ముఖ్యంగా సచిన్ అరుదైన రికార్డుని సమం చేశాడు.
2011లో టెస్టు అరంగేట్రం చేసిన వార్నర్.. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై టెస్టులో సెంచరీ చేసి 8000 పరుగుల మార్క్ ని క్రాస్ చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఆసీస్ ఎనిమిదో బ్యాటర్ గా నిలిచాడు. అలానే తమ కెరీర్ లోని 100వ టెస్టులో సెంచరీ చేసిన పదో బ్యాటర్ గా వార్నర్ నిలిచాడు. ఇతడి కంటే ముందు కౌడ్రే, మియందాద్, గ్రీనిడ్జ్, స్టీవర్ట్, ఇంజిమామ్, పాంటింగ్, గ్రేమ్ స్మిత్ , ఆమ్లా, రూట్ ఉన్నారు. ఇక టెస్టులో ఎక్కువ సెంచరీలు చేసిన ఐదో ఓపెనర్ గానూ వార్నర్ రికార్డ్ సెట్ చేశాడు. గావస్కర్, కుక్, హేడెన్, గ్రేమ్ స్మిత్.. ఈ జాబితాలో వార్నర్ కంటే ముందున్నారు. అన్ని ఫార్మాట్లు కలిపి ఎక్కువగా అంటే 45 సెంచరీలు చేసిన ఓపెనర్ గానూ వార్నర్ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే సచిన్ రికార్డుని సమం చేశాడు. సరే ఇదంతా పక్కనబెడితే.. మూడేళ్ల తర్వాత వార్నర్ సెంచరీ చేయడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Don’t ever write this man off! David Warner brings up 100 in his 100th Test. What a moment! A brilliant innings thus far. 🔥 #AUSvSA @davidwarner31 pic.twitter.com/uzpvWOfZjr
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) December 27, 2022