లాహోర్ వేదికగా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టిన 24 ఏళ్ల తర్వాత ఓ శుభారంభం లభించింది. మూడు టెస్టుల సిరీస్ లో మొదటి రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి. మూడో టెస్టులో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శనతో సిరీస్ ను కైవసం చేసుకుంది. 115 పరుగుల ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా విజయం కన్నా డేవిడ్ వార్నర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంది ఎందుకు అంటే వార్నర్ సెలబ్రేట్ చేసుకున్న తీరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఇదీ చదవండి: ఈ మార్పులతో IPL క్రేజ్ తగ్గుతుందా…?
వార్నర్ బ్యాటింగ్ తోనే కాదు.. గ్రౌండ్ లో తన సెలబ్రేషన్ తోనూ ఆకట్టుకుంటూ ఉంటాడు. అదే పాక్ మ్యాచ్ లోనూ రిపీట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్ లో నాథన్ లైన్ 88వ బౌలింగ్ చేశాడు. 88వ ఓవర్ లాస్ట్ బాల్ లో హసన్ అలీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ సమయంలో హసన్ ఎదురుగా ఉన్న వార్నర్ అచ్చూ హసన్ స్టైల్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. అది చూసి హసన్ పేలగా ముఖం పెట్టుకుని.. హేళన చేయకు బ్రో అన్నట్లు ఒక లుక్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.