క్రీడా ప్రపంచంలో ఎవరినీ తక్కువగా అంచానా వేయకూడదు. తమదైన రోజు వస్తే మనం తక్కువ అంచనా వేసిన జట్టే మనపై విజయం సాధిస్తుంది. ఇప్పుడు ఇదే నిజం చేసి చూపించింది జింబాబ్వే జట్టు. తాజాగా జరిగిన చివరి వన్డే లో ఆస్ట్రేలియా పై చిరకాల విజయం సాధించింది. అదీ వారి సొంత గడ్డపై. సిరీస్ ను ఆసిస్ 2-1 తో కైవసం చేసుకున్నప్పటికీ చివరి వన్డే లో జింబాబ్వేకి ఓదార్పు విజయం దక్కింది. అయితే ఈ మ్యాచ్ లో ఆసిస్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజాల సరసన నిలిచాడు. మరి వార్నర్ సాధించిన ఆ రికార్డ్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియా – జింబాబ్వే మధ్య జరిగిన మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ర్యాన్ బర్ల్ బౌలింగ్ ధాటికి 31 ఓవర్లలోనే కేవలం 141 పరుగులకే చాపచూట్టేసింది. ఆసిస్ బ్యాటింగ్ లో వార్నర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. జింబాబ్వే బౌలర్లకు ఎదురు నిలబడి 94 పరుగులు చేసి 8వ వికెట్ గా వెనుదిరిగాడు. మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే తడబడుతూనే లక్ష్యాన్ని ఛేదించింది. 39 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి చిరస్మరణియమైన విజయాన్ని అందుకుంది. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ మరుమని 47 బంతుల్లో 35 పరుగులు చేశాడు. కెప్టెన్ చకాబ్వా 72 బంతుల్లో 37 రన్స్ తో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందిచాడు.
ర్యాన్ బర్ల్ 3 ఓవర్లలో కేవలం 10 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికేట్లు తీసి ఆసిస్ పతనాన్నిశాసించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అదేంటంటే ఓ జట్టు మెుత్తం స్కోరులో ఒక ఆటగాడు సాధించిన పరుగుల శాతంలో ఎక్కువ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. మెుదటి స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం వీవీ రిచర్డ్స్ ఉన్నాడు. వార్నర్ 94 రన్స్ చేయడం ద్వారా భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును దాటేశాడు. అతడు శ్రీలంక మీద చేసిన 264 పరుగులు చేసిన విషయం మనందరికి తెలిసిందే.
ఈ రికార్డుల గురించి మరింత లోతులోకి వెళితే.. వీవీ రిచర్డ్స్ ఇంగ్లాండ్ పై 189 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అప్పడు వెస్టిండీస్ జట్టు మెుత్తంగా 272/9 పరుగులు చేసింది. ఈ రన్స్ మెుత్తంలో 69.48 శాతం పరుగులు ఒక్క రిచర్డ్స్ చేసినవే. ఇక రెండో స్థానంలోకి వచ్చిన వార్నర్ ఆసిస్ చేసిన 141 పరుగుల్లో 94 రన్స్ చేశాడు. అంటే దాదాపు 66.66 శాతం పరుగులు అతనొక్కడే చేశాడు. ఇక భారత దిగ్గజం కపిల్ దేవ్ జింబాబ్వే మీద 175 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అప్పుడు జట్టు స్కోరు మెుత్తం 266/8. ఈ స్కోరు మెుత్తంలో కపిల్ 65.78 శాతం చేయడం విశేషం. నాలుగవ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ గతంలో శ్రీలంకపై 264 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడు భారత్ 404/5 పరుగులు చేసింది. ఈ పరుగుల్లో 65.34 శాతం పరుగులను రోహిత్ ఒక్కడే కొట్టాడు. వార్నర్ తాజాగా ఈ రికార్డ్ ను బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
.@davidwarner31 pic.twitter.com/71yMX5xVnd
— CricTracker (@Cricketracker) September 3, 2022