ఊహకి అందనవి జరగడమే జీవితం. ముఖ్యంగా చావు, పుట్టుకలు అనేవి మనుషుల చేతుల్లో ఉండేవి కాదు. ఇందుకు ఎవ్వరూ అతీతం కాదు. స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ ఇంట ఇలాంటి విషాదమే నెలకొంది. డేవిడ్ మిల్లర్ తన కూతురు మరణించినట్టు తాజాగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశాడు. మిల్లర్ కూతురు అతి చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడిన విషయం చాలా మందికి తెలియదు. అప్పటి నుండి ఆ చిన్నారి క్యాన్సర్ తో పోరాడుతూనే.. ఇప్పుడు కన్నుమూసింది. ఈ నేపథ్యంలోనే మిల్లర్ ఇన్ స్టా వేదికగా తన కూతురిని తలుచుకుంటూ భావోద్వేగభరితమైన పోస్ట్ చేశాడు.
“తల్లి నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నేను చూసిన వారిలో కల్లా నువ్వే ఎక్కువ ధైర్యం కలిగిన వ్యక్తివి. చిన్న వయసులోనే జీవితంలో చాలా కష్టాలను అనుభవించావు. కానీ.., ప్రతి కష్టాన్ని దైర్యంగా, మొహంపై చిరునవ్వు చెదరకుండా ఎదుర్కొన్నావు. జీవితంలో నీకు ఎదురైన ప్రతి వ్యక్తికి ప్రేమని పంచావు. ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించాలన్న విషయాన్ని నేను నీ నుండే నేర్చుకున్నాను. ఇన్నాళ్లు నువ్వు నా జీవితంలో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూ ఉంటాను” అంటూ తన పోస్ట్ ని ముగించాడు. అయితే.. మిల్లర్ తన కూతురు ఎప్పుడు చనిపోయింది అనే విషయాన్ని మాత్రం వివరంగా తెలపలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక మిల్లర్ ఇండియా టూర్ లో బిజీగా ఉన్నాడు. రానున్న వరల్డ్ కప్ లో ప్రోటీస్ టీమ్ కి ఇతనే కీలక ఆటగాడు. తాజాగా ఇండియాతో జరిగిన టీ 20 సీరీస్ లో కూడా మిల్లర్ సెంచరీతో మెరిశాడు. ఇక మొదటి వన్డే లో కూడా మిల్లర్ మించి ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న మిల్లర్ జీవితంలో ఒక్కసారిగా ఇంతటి విషాదం చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి.. మిల్లర్ ఈ బాధ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుందాము.