స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో వరుసగా ఎదురవుతున్న పరాజయాలకు శ్రీలంక క్రికెట్ జట్టు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టగలిగింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన శ్రీలంక వైట్ వాష్ కాకుండా బయటపడగలిగింది. శనివారం పళ్లకెలే వేదికగా జరిగిన మూడో టి20లో పర్యాటక జట్టుపై మరో బంతి మిగిలి ఉండగానే.. లక్ష్యాన్ని ఛేదించి పరువు దక్కించుకుంది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ స్థితిలోనూ గెలిచేలా కనిపించలేదు. 17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6… చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావాలి. కానీ కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో అసాధ్యం అనిపించినదాన్ని ఒక్కసారిగా సుసాధ్యం చేసేశాడు. వరుసగా చివరి 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టి లంకను విజయ తీరానికి చేర్చాడు. దాసున్ షనక మెరుపు ఇన్నింగ్స్ పై పలువురు ప్రశంశలు కురిపిస్తున్నారు. 3 ఓవర్లలో 3 పరుగులు ఇచ్చిన హాజల్ వుడ్ లాంటి బౌలరుకు 22 పరుగులు కొట్టడమంటే మాములు విషయం కాదని కొనియాడుతున్నారు. ‘హీరో అఫ్ ది మ్యాచ్ దాసున్ షనక’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాసున్ షనక ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Highlights of last 3 overs#Shanaka#SLvAUS#AUSvsSL https://t.co/YlidfL0Qyp pic.twitter.com/2hPuNfNoTE
— Ankit Chaudhary (@Ankit_Sihag_) June 12, 2022
ఇది కూడా చదవండి: Tilak Varma: దటీజ్ తిలక్ వర్మ. IPLలో వచ్చిన డబ్బులు ఏం చేశాడో తెలుసా..?