క్రికెట్‌లో సెలబ్రేషన్స్ అంటే ఠక్కున గుర్తుకువచ్చేది విండీస్ ఆటగాళ్లే. వారి వే ఆఫ్ సెలబ్రేషన్స్ స్టైలే వేరు. వారిని చూసి ఇన్స్‌పైర్ అయిన క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా డ్వేన్ బ్రావో, క్రిస్ గేల్ వంటి స్టార్ క్రికెటర్లు మైదానంలో సెలబ్రేషన్స్‌తో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వారి సంబురాలకు సపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. గేల్ గాంగ్‌నమ్ డాన్స్, బ్రావో ఛాంపియన్ డాన్స్ విశేష ఆదరణ పొందాయి. వికెట్ పడినా, సెంచరీ కొట్టినా వారి సెలబ్రేషన్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రం చెప్పనక్కర్లేదు. రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ నెగ్గిన సమయంలో వెస్టిండీస్ సంబురాలు అంబరాన్ని అంటాయి. విశేషం ఏదైనా సెలబ్రేట్ చేసుకోవడంలో కరేబియన్ల స్టైలే వేరు. అందుకే అంతర్జాతీయ క్రికెట్ దూరమైనా.. విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ చేసిన ఒక డాన్స్ వీడియో కూడా వైరల్‌గా మారింది.
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ సంతోషం పట్టలేక గ్రౌండ్‌లోనే డాన్స్‌తో అదరగొట్టాడు. ఆ ఆనందం మ్యాచ్ గెలిచినందుకో.. మంచి ప్రదర్శన ఇచ్చినందుకో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సామీ డాన్స్ చేసింది అందుకు కాదు. కానీ.. తన డాన్స్‌కు ఏకంగా 20 లక్షల కారణాలు ఉన్నట్లు తెలిపాడు. మరి సామీ డాన్స్ వెనుక అన్ని కారణాలు ఏమై ఉంటాయబ్బా అంటూ నెత్తి బాదుకోకండి. అతను డాన్స్ చేసింది.. ట్విట్టర్‌లో తన ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్స్‌కు చేరుకుంది. అంటే డారెన్ సామీని ట్విట్టర్‌లో 20 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఈ మైల్‌స్టోన్‌ను చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. సామీ సూపర్ స్టెప్పులతో అదరగొట్టాడు. ప్రస్తుతం సామీ డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2 Million reasons to have a dance. Thank you Twitter family… 🕺🏿 🕺🏿🕺🏿 pic.twitter.com/tzN2xGMy12
— Daren Sammy (@darensammy88) October 10, 2022