తాజాగా ఆసీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో ఇటు టీమిండియా మాజీ క్రికెటర్లతో సహా.. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా టీమిండియాపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ స్పిన్నర్ అయితే ఏకంగా.. ప్రస్తుతం ఉన్న బౌలర్లతో టీమిండియా వరల్డ్ కప్ గెలవదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
వరల్డ్ కప్ 2023కు మరికొన్ని నెలలే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని అన్ని దేశాలు వరల్డ్ కప్ నెగ్గడమే ధ్యేయంగా.. అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటు టీమిండియా సైతం వరల్డ్ కప్ ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. అయితే కొన్ని రోజుల వరకు జోరుమీదున్న టీమిండియా.. ఆసీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం ఘోరంగా విఫలం అయ్యింది. ఆసీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1తో కోల్పోయింది భారత్. దాంతో ఇటు టీమిండియా మాజీ క్రికెటర్లతో సహా.. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా టీమిండియాపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ స్పిన్నర్ అయితే ఏకంగా.. ప్రస్తుతం ఉన్న బౌలర్లతో టీమిండియా వరల్డ్ కప్ గెలవదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తాజాగా ఆసీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్ 2023 కోసం సిద్ధం అవుతున్నతరుణంలో ఇలాంటి ఓటములు జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇక ఆసీస్ తో జరిగిన మూడు మ్యాచ్ ల్లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం అయ్యారు. ఇక ఈ సిరీస్ ఓటమి గురించి పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మాట్లాడాడు. భారత జట్టు బ్యాటింగ్ విభాగంతో పాటుగా బౌలింగ్ దళంపై కూడా విమర్శలు గుప్పించాడు. డానిష్ కనేరియా మాట్లాడుతూ..”స్వదేశంలో జరగనున్న వరల్డ్ కప్ కు టీమిండియా ఇంకా సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇక ఆసీస్ తో జరిగిన సిరీస్ లోనైతే.. పేలవమైన బ్యాటింగ్ తో పాటుగా, బౌలింగ్ దళం ఏ మాత్రం ప్రభావం చూపలేదు. అదీకాక టీమిండియా వరల్డ్ కప్ సాధించాలి అనుకుంటే.. ఈ బౌలర్లలో ప్రపంచ కప్ గెలవలేదు” అంటూ విమర్శించాడు డానిష్ కనేరియా.
ఇక విరాట్ తన గత ఫామ్ లోకి రావడానికి చాలా టైమ్ తీసుకున్నాడని, అయితే విరాట్ ఫామ్ వల్ల జట్టులో ఎలాంటి మార్పులు రాలేదని ఈ సందర్భంగా కనేరియా చెప్పుకొచ్చాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లో లేడు, శాంసన్ ను టీమ్ లోకి తీసుకోట్లేదు. పైగా అయ్యర్ గాయాలు ఆందోళన కలిగిస్తోంది అని చెప్పుకొచ్చాడు. జట్టులోకి ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, నటరాజన్ లకు అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. మరి కనేరియా చెప్పినట్లుగా వచ్చే వరల్డ్ కప్ కు భారత్ సిద్ధంగా లేదా? అతడి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.