ఐపీఎల్ 2022 సీజన్ ఉత్కంఠగా సాగుతోంది. కొత్త ఫ్రాంచైజీలు, కొత్త రూల్స్ అంతా కొత్త ఉత్సాహంతో కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతోంది. ఎవరు ఎలా ఆడతారు అని ఎక్కువగా చర్చించుకుంటుంటారు. ప్రస్తుతం ఇంకా ఆరో మ్యాచ్ గురించే చర్చ నడుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. అందేంటంటే.. సీఎస్కే ఫ్యాన్స్ వచ్చి ఆర్సీబీకి సపోర్ట్ చేయడం.
ఇదీ చదవండి: కోహ్లీ చేసిన పనికి రచ్చ! కోహ్లీ vs అయ్యర్!
ఆర్సీబీ మ్యాచ్ నడుస్తోంది.. అక్కడ ఓ బ్యానర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో ఫాఫ్ డుప్లెసిస్ ఫొటో ఉంది. ‘మేము సీఎస్కే అభిమానులం.. కానీ ఫాఫ్ డుప్లెసిస్ కోసమే ఇక్కడికి వచ్చాం’ అని ఫ్లెక్స్ లో రాసుంది. సోషల్ మీడియాలో ఆ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎవరైనా ఒక వ్యక్తిని, అతని ఆటను ఇంతలా అభిమానిస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రాంచైజీలకు ఉన్నట్లు బేరసారాలు, వ్యూహాలు, ప్రణాళికలు అభిమానులకు ఉండవు. అందుకు సీఎస్కే అభిమానులం అని చెప్పుకుంటూనే అటు ఫాఫ్ కోసం ఆర్సీబీ మ్యాచ్ కు వెళ్లారు.
Fans poster during #RCBvsKKR :
“We are CSK fans, but we are here for Faf Du Plessis @faf1307 💛🦁.” #WhistlePodu | #IPL2022 pic.twitter.com/K6wg4oF1Be
— CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) March 30, 2022
ఫాఫ్ విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో రూ.7 కోట్లకు డుప్లెసిస్ ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత జట్టుకు కెప్టెన్ ను చేసింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో రెండు మ్యాచ్ లు ఆడి.. ఒక విజయం, ఒక ఓటమితో కొనసాగుతున్నారు. పంజాబ్ పై మొదటి మ్యాచ్ లో ఓడినా.. రెండో మ్యాచ్ లో కేకేఆర్ పై విజయం సాధించారు. ఆర్సీబీ ఈ సీజన్ అయినా కప్పు కొడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.