మనం నిత్యం తినే పదార్థాలు, తాగే నీటి కోసం ఖర్చు చేస్తుంటాము. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి ఆస్పత్రిల్లో కొద్ది ఖర్చులో ఆక్సిజన్ తీసుకుంటాం. కానీ ఓ స్టార్ ప్లేయర్ గాలి కోసం రూ.15 లక్షలు ఖర్చు చేశాడు. అదేంటి స్వేచ్ఛగా పీల్చుకోవడానికి వాతావరణంలో గాలి ఉంది కదా! మరి ఇంత ఖర్చు ఎందుకు పెట్టారు అని అనుకుంటున్నారా? ఆ గాలికి చాలా ప్రత్యేకత ఉంది. ఇక ఇంత భారీగా ఖర్చు పెట్టి గాలిని కొనుగోలు చేసింది మరేవరో కాదు.. స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. పొర్చుగల్ కు చెందిన ఈ స్టార్ సాకర్ ప్లేయర్ ఎందుకు ఈ గాలి కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చుపెట్టాడు, దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
గాలి కోసం రొనాల్డో ఓ మెషన్ ని కొనుగోలు చేశాడు. ఈ మిషిన్ పేరు హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ (HBOT). దీని ఖరీదు 15,000 పౌండ్లు అంటే మన కరెన్సీలో రూ.15 లక్షలపైనే. ఈ మెషిన్ ప్రత్యేకత ఏంటంటే.. ప్యూర్ ఆక్సిజన్ ను రక్తంలోకి పంపి రక్తపు ప్లాస్మాలోని దెబ్బతిన్న కణజాలాలను క్యూర్ చేస్తుంది. ఫిట్ నెస్ కు మొదటి ప్రాధాన్యత ఇచ్చే పోర్చుగల్ ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డో.. ఈ పత్యేక ఛాంబర్ ను తన జిమ్ రూమ్ లో ఈ ఇటీవలే ఏర్పాటు చేయించాడు. చిన్నచిన్న గాయాల కారణంగా మ్యాచ్ లకు దూరం పెడుతుండటంతో.. రొనాల్డ్.. ఇలాంటి మెషిన్ ద్వారా ఉపశమనం పొందుతాడట.వాస్తవానికి రొనాల్డో ఇలాంటి ఛాంబర్లను ఉపయోగించడం కొత్తేం కాదు. 2016లో యూరో ఫైనల్‌లో తగిలిన మోకాలి గాయం తర్వాత స్పానిష్ ఐల్యాండ్ ఇబిజాకు వెళ్లి.. ఇలాంటి ఛాంబర్ లోనే ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. కానీ యూకేలో అలాంటి మెషిన్‌లు దొరక్కపోవడంతో.. దీన్ని కొని తన ఇంట్లోనే ఇన్‌స్టాల్ చేయించుకున్నాడు. ఇదిలా ఉంటే.. గతంలోనూ 50 వేల పౌండ్లు ఖర్చు పెట్టి ఐస్ ఛాంబర్ ను కొన్న విషయం తెలిసిందే.
ఇక ఈ HBOT విషయానికి వస్తే ఇందులో చిన్న ఛాంబర్ లాంటి గది ఉంటుంది. ఈ మెషిన్ డ్రైవింగ్ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ల కోసం రూపొందించారు. అయినప్పటికీ రకరకాల ఇతర జబ్బులు ఉన్నవాళ్లు కూడా ఈ మెషిన్ చికిత్సను ఆశ్రయిస్తుంటారు. ఈ చికిత్స తీసుకునే వారిలో సెలబ్రిటీలే ఎక్కువంటా. HBOT లను అనుమతులు పొందాకే వాడాల్సి ఉంటుంది. వీటి వలన ఉపయోగాలే కాదు.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట. అందుకే వీటిని వినియోగించేముందు కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తుంటారు మరి!. 1662లో ఓ ఫిజీషియన్ ఇలాంటి ఛాంబర్ ఒకటి ఫ్యూర్ ఆక్సిజన్ కోసం నిర్మించినట్లు సమాచారం. ఖరీదైన ఈ HBOT మెషిన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.