లక్నో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ చెలరేగారు.బ్యాట్స్‌మెన్లు, బౌలర్ల సమిష్టి కృషితో ఈ మ్యాచ్‌ను భారత్ చాలా సునాయాసంగా గెలిచింది. మొదటి T20లో విజయం అనంతరం శ్రీలంకతో జరిగనున్న రెండవ T20కోసం టీమిండియా బృందం శనివారం ధర్మశాలకు చేరుకుంది. బస్సులో వెళ్తున్న మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్ మరికొందరు క్రికెటర్లు బాలీవుడ్ సాంగ్ పాడతూ తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.
శ్రీలంకతో జరిగిన మొదటి టీ-20 విజయం అనంతరం టీమిండియా తదుపరి మ్యాచ్ కోసం ధర్మశాలకు బయలుదేరింది. ఈ క్రమంలో విమానాశ్రయానికి చేరుకోవడానికి బస్సులో ప్రయాణించారు. ఆట ధ్యాస నుంచి బయటకు వచ్చి టీమిండియా ప్లేయర్లు సింగర్స్ గా మారారు. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో మహ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్ మరియు కుల్దీప్ యాదవ్ ఓ బాలీవుడ్ పాట పాడుతూ ఎంజాయ్ చేశారు. వీరి మిగిలిన ప్లేయర్లు కూడా వీరితో పాటు ఎంజాయ్ చేశారు. దీంతో బస్సులో ఒక్కసారిగా పండుగ వాతారవరణంలోకి వెళ్లింది. సరదా వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేసింది. మరి.. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Match Day 🙌
Onto the 2nd @Paytm #INDvSL T20I at Dharamsala 📍#TeamIndia pic.twitter.com/iAGh8FDrwt
— BCCI (@BCCI) February 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.