డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2020లో డేవిడ్ వార్నర్ అలరించినంతగా ఏ క్రికెటర్ కూడా అలరించలేదు. హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్ వీడియోలతో ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన భారత్ లో యమా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరోసారి తన క్రియోటివిటీ చూపించాడు. గతంలో టిక్ టాక్ వీడియోల రూపంలో అభిమానులను అలరించిన వార్నర్ తాజాగా రూట్ మార్చాడు. ఐపీఎల్ హైదరాబాద్ జట్టు మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి భారతీయులను అలరించే ప్రయత్నం చేశాడు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమా పాటలకు అదరగొట్టే స్టెప్పులేసిన హీరోల మొహలను స్వాపింగ్ చేస్తూ సరదా వీడియోలు క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో అభిమానులను అలరించే డేవిడ్ వార్నర్ ఈసారి రజనీకాంత్ అవతారం ఎత్తాడు.
దశాబ్దం క్రితం రజనీకాంత్-ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘‘రోబో’’ సినిమాలోని ‘కిలిమంజారో..’’ పాటకు హీరో రజనీకాంత్ మొహనికి బదులు తన మొహాన్ని జోడించాడు డేవిడ్ వార్నర్. రజనీకాంత్ ను అనుసరిస్తూ చేసిన ఆ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయగా.. అది వైరల్ అవుతోంది. కొన్ని గంటల్లోనే లక్ష మందికిపైగా చూశారు.. చూస్తున్నారు. రజనీకాంత్ ప్లేసులో డేవిడ్ వార్నర్ మొహం చూస్తే తెగ నవ్వొస్తుంది. చాలా కాలం గ్యాప్ తర్వాత డేవిడ్ వార్నర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు బాగా స్పందించి కామెంట్లు పెడుతున్నారు. డేవిడ్ వార్నర్ కు ఆస్ట్రేలియాతోపాటు భారత్ లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈక్రమంలో డేవిడ్ వార్నర్ ఇండియన్ సినిమాకు సంబంధించిన సెలబ్రెటీల టిక్ టాక్ వీడియోలు చేస్తూ అలరించాడు. ఆయన వీడియోలకు భారతీయుల నుంచి మంచి స్పందన లభించడంతో వార్నర్ దానిని కంటిన్యూ చేస్తూ వెళుతున్నాడు.
రజనీ అభిమానులే కాదు… అందర్నీ అలరించేలా ఉన్న ఈ వీడియో మీకోసం: