క్రికెటి, సినిమా ఈ రెండింటికి భారత్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో.. జనం ఎంత అభిమానం చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇలాంటి ఫొటోలే అందుకు సాక్ష్యం. ఇంకీ వీళ్లంతా ఎవరంటే..
ఇండియాలో సినిమా, క్రికెట్ రెండు అప్రకటిత మతాలు. సినిమా హీరోలు, క్రికెటర్లు ఇక్కడ డెమీ గాడ్స్. తమ అభిమాన హీరో సినిమాలు చూసేందుకు జనం ఎగబడతారు. అలాగే టీమిండియా ఆడే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు సైతం క్రికెట్ ఫ్యాన్స్ పొటెత్తుతారు. సినిమా, క్రికెట్ ఈ రెండు ఎమెషన్స్‌ను ఇండియాలో కంట్రోల్ చేయడం అసాధ్యం. అందుకే పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. ఫస్ట్ డే ఫస్ట్‌షో టిక్కెట్ల కోసం అభిమానులంతా.. ఎలాగైతే లైన్లలో పడిగాపు కాస్తారో.. అలాగే క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం కూడా క్రికెట్ అభిమానులు అలాగే ఎగబడతారు. తాజాగా క్రికెట్ అభిమానులు టిక్కెట్ల కోసం రాత్రంతా క్యూలైన్లో ఉన్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు చెన్నైలోని చిదంబరం క్రికెట్ స్టేడియం వద్ద రాత్రి మొత్తం లైన్‌లోనే ఉన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 22న చివరిదైన మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ టిక్కెట్లు అమ్ముతున్నారు. ఈ టిక్కెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఇలా పడిగాపులు కాశారు. క్రికెట్‌పై వీరికున్న పిచ్చి అభిమానంపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే తొలి వన్డే ముంబైలో ముగిసిన విషయం తెలిసిందే. రెండో వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరగనున్న విషయం తెలిసిందే.
తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శుక్రవారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌట్ అయింది. భారత పేసర్లు మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లతో చెలరేగడంతో.. ఆసీస్ తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. ఈ స్వల్ప స్కోర్‌ను ఛేదించడంలో భారత బ్యాటింగ్ లైనప్ ఆరంభంలో తడబడింది. కేవలం 16 పరుగులకే ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. కొద్దిసేపటికే గిల్ కూడా అవుట్ కావడంతో మరింత ఇబ్బందుల్లో పడింది. కానీ, కేఎల్ రాహుల్.. హార్దిక్ పాండ్యా, జడేజాతో అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియాను గెలిపించాడు. మ్యాచ్ సంగతి పక్కనపెడితే.. మూడో వన్డే టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు రాత్రంతా వేచి ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Cricket fans in Chennai waiting for the tickets for the 3rd ODI from 2 am this morning. pic.twitter.com/uVlItXL0yV
— Johns. (@CricCrazyJohns) March 18, 2023