టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్‌లో కొనసాగుతున్నాడు. తన ఫూర్ ఫామ్‌తో క్రికెట్ అభిమానుల నుంచి దారుణమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని క్రికెట్‌లో అదరగొట్టడం కూడా రాహుల్‌పై విమర్శలకు ఆయుధంగా మారింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉన్నప్పటికీ.. కొంతమంది ఆటగాళ్ల ప్రదర్శన అంతగా బాలేదు. చాలా దారుణంగా విఫలం అవుతున్నారు. జట్టు విజయాలు సాధిస్తుండటంతో వారి వైఫల్యం మరీ అంతగా కనిపించడం లేదు. ఇలా టీమ్ విజయం వెనుక తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుతున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉండేది మాత్రం కేఎల్ రాహులే. కొంతకాలంగా ఫేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రాహుల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. చెత్త ఫామ్‌లో ఉండి, పరుగులు చేయలేకపోతున్నా.. జట్టులో ఉంటుండటం, పైగా ఫామ్‌లో ఉన్న గిల్ లాంటి ఆటగాళ్లను రాహుల్ కోసం పక్కనపెడుతుండటం కూడా రాహుల్‌పై తీవ్రమైన విమర్శలు రావడానికి కారణం అవుతున్నాయి.
ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్, ఢిల్లీ వేదికగా జరిగిన రెండు టెస్టుల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో కేవలం ఒకే ఇన్నింగ్స్ అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌లో 20 పరుగులు చేసి అవుటైన రాహుల్ తన బ్యాడ్ ఫామ్‌ను కొనసాగించాడు. తాజాగా ఢిల్లీలో ముగిసిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 17, సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అంతగా అనుకూలంగా లేదని ఎంత చెప్పుకున్నా.. రాహుల్ ఫామ్‌లో లేడనే విషయాన్ని కూడా ఒప్పుకుని తీరాలి. అది అతని బాడీ లాంగ్వేజ్, బ్యాటింగ్ అప్రోచ్ చూస్తేనే అర్థం అయిపోతుంది. ఫామ్‌లో ఉండే రాహుల్‌కు ఇప్పటి రాహుల్‌కు తేడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయినా కూడా టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని టీమ్‌లో కొనసాగిస్తూ.. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేస్తోంది. ముఖ్యంగా రాహుల్ వల్ల గిల్ ఎక్కువగా నష్టపోతున్నాడు.
అయితే.. తొలి రెండు టెస్టుల్లో రాహుల్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ బ్యాక్‌చేసింది. ఇక మిగిలిన రెండు టెస్టులకు రాహుల్‌పై వేటు పడటం ఖాయం అనుకుంటున్న దశలో.. చివరి రెండు టెస్టులకు అతన్ని ఎంపిక చేయడమే కాకుండా.. అతన్ని మరింత బ్యాక్ చేస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొనడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రాహుల్ కంటే.. సినీ నటుడు అక్కినేని అఖిల్‌ను జట్టులోకి తీసుకోవాలని సెటైర్లు పేలుస్తున్నారు. తాజాగా సీసీఎల్ 2023(సెలబ్రెటీ క్రికెట్ లీగ్) సీజన్ ప్రారంభమైంది. ఆదివారం కేరళ స్ట్రైకర్స్‌తో తెలుగు వారియర్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్న అఖిల్ సంచలన బ్యాటింగ్‌తో చెలరేగాడు.
టీ20 మ్యాచ్‌ను 10 ఓవర్లుగా డివైడ్ చేసి.. మొత్తం 40 ఓవర్ల మ్యాచ్‌గా ఆడిన మ్యాచ్‌లో అఖిల్.. తొలి 10 ఓవర్ల ఇన్నింగ్స్‌లో కేవలం 30 బంతుల్లోనే 91 పరుగులు బాదాడు. ఆ తర్వాత మరో 10 ఓవర్ల ఇన్నింగ్స్‌లో కేవలం 19 బంతుల్లోనే 65 పరుగులు బాదేసి.. తెలుగు వారియర్స్‌ను గెలిపించాడు. దీంతో రాహుల్ ప్లేస్‌తో అఖిల్‌ను ఆడించినా కాస్త ఉపయోగం ఉంటుందని క్రికెట్ అభిమానులు రాహుల్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా.. అఖిల్ సినిమా హీరో కావడానికి ముందు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ప్రొఫెషన్ క్రికెటర్ అయ్యేందుకు ఆస్ట్రేలియాలో చాలా ఏళ్లపాటు క్రికెట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. కానీ.. ఆ తర్వాత క్రికెట్ నుంచి సినిమాల వైపు తన కెరీర్‌ను మార్చుకున్నాడు. ఇప్పటికే అఖిల్, మజ్ను, హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాల్లో నటించాడు. కొన్ని రోజుల్లో ఏజెంట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే అఖిల్‌కు ఇప్పటి వరకు భారీ హిట్ రాలేదు. సినిమా సంగతి అటుంచితే.. నెటిజన్లు ట్రోల్ చేసినట్లు రాహుల్ ప్లేస్‌తో అఖిల్‌ను ఆడించడం సాధ్యమయ్యే పని కాదు కానీ.. రాహుల్ ఫామ్‌పై, అలాగే సీసీఎల్‌లో అఖిల్ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
There is a view that KL Rahul has an outstanding overseas Test record. But stats speak otherwise. He has a test avg of 30 overseas in 56 innings. He has scored 6 overseas centuries but followed it up with a string of low scores that’s why averaging 30. Let’s look at a few others pic.twitter.com/MAvHM01TcY
— Venkatesh Prasad (@venkateshprasad) February 20, 2023
Captain & Coach on KL Rahul pic.twitter.com/1KcvgO7pV6
— RVCJ Media (@RVCJ_FB) February 19, 2023