భారత్-బంగ్లాదేశ్ మధ్య చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఆరంభంలోనే టీమిండియాకు బంగ్లా బౌలర్లు షాకిచ్చారు. 40 బంతుల్లో 20 పరుగులు చేసి యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను తైజుల్ ఇస్లామ్ అవుట్ చేశాడు. దీంతో టీమిండియా 41 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే మరో ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్లపైకి ఆడి.. ఖలీద్ అహ్మద్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. 54 బంతులాడిన రాహుల్ కేవలం 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 45 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోవడంతో ఓపెనర్లు ఇద్దరూ.. పెవిలియన్ చేరారు.
మరో మూడు పరుగుల తర్వాత.. బంగ్లాదేశ్‌కు పెద్ద వికెట్ దక్కింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలో సెంచరీతో చెలరేగిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తైజుల్ ఇస్లామ్ వేసిన అద్భుతమైన బాల్‌కు వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కోహ్లీ సైతం పెవిలియన్ చేరడంతో.. టీమిండియా 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే.. టీ20, వన్డేల్లో విఫలం అవుతున్న రిషభ్ పంత్.. మరోసారి తనకు అచ్చొచ్చిన టెస్టు క్రికెట్‌లో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అది కూడా అగ్రెసివ్ ఇంటెంట్‌తో బ్యాటింగ్ చేశాడు. 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సుతో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక్కడి నుంచి పుజారాతో జతకలిసిన శ్రేయస్ అయ్యర్.. మరో వికెట్ పడకుండా.. జాగ్రత్తగా ఆడుతూ.. టీమిండియా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు.
ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 149 పరుగుల భారీ స్కోర్ జోడించారు. 90 పరుగులు చేసి పుజారా తైజుల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యి.. సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక తొలి రోజు ఆఖరి ఓవర్ చివరి బంతికి 14 రన్స్ చేసిన అక్షర్ పటేల్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఇలా తొలి రోజు బంగ్లాదేశ్, భారత్ ఇరు జట్లు సమానంగా పైచేయి సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి.. భారత్ 6 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 82 పరుగుల నాటౌట్‌గా ఉన్నాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3, మెహిదీ 2, ఖలీద్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ వైఫల్యంపై మరోసారి సోషల్ మీడియాలో దారుణ ట్రోలింగ్ జరుగుతోంది. గాయంతో రెగ్యలర్ కెప్టెన్ రోహిత్ శర్మ చివరి వన్డేతో పాటు, తొలి టెస్టుకు సైతం దూరం కావడంతో.. కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టెస్టు సిరీస్‌కు ముందు ట్రోఫీ ఆవిష్కరణ సమయంలో మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్.. టెస్టు క్రికెట్‌లో అగ్రెసివ్‌గా ఆడతామని ప్రకటించాడు.
టెస్టు క్రికెట్‌ను అగ్రెసివ్‌గా ఆడుతూ.. ఇంగ్లండ్ టీమ్ మంచి ఫలితాలు సాధిస్తోంది. బజ్‌బాల్ స్ట్రాటజీతో ఇంగ్లండ్ టెస్టులకే కొత్త కళ తెస్తోంది. కానీ.. టీమిండియా మాత్రం టీ20, వన్డేలో సైతం వేగంగా ఆడటంలేదనే విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అప్రోచ్‌పై తీవ్ర స్థాయిలో క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. భయపడుతూ బ్యాటింగ్ చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. వీటన్నింటికి సమాధానం చెబుదాం అనుకున్న రాహుల్.. బంగ్లాతో టెస్టు సిరీస్‌లో తమ అగ్రెసివ్ ఆటను చూస్తారని మ్యాచ్‌కు ముందే చెప్పాడు. కానీ.. తీరా మ్యాచ్‌లో చూస్తే.. 54 బంతులాడి కేవలం 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో మరోసారి రాహుల్ ట్రోలర్స్‌కు టార్గెట్‌గా మారిపోయాడు. అగ్రెసివ్ బ్యాటింగ్ అంటే ఇదేనా ? అంటూ రాహుల్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ నీకు మాత్రమే సాధ్యమవుతుందంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. మరి రాహుల్ కామెంట్స్‌పై, ఆడిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
KL Rahul gives a bold statement before the start of Test series against Bangladesh.#BANvIND pic.twitter.com/cpwemNSfbJ
— CricTracker (@Cricketracker) December 13, 2022