న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. ఇది పెద్ద విజయమే కానీ.. ఈ సిరీస్ గెలుపు కంటే.. శుబ్‌మన్ గిల్ బ్యాటింగే హైలెట్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో గిల్ ఆడిన తీరు అద్భుతం. ఒక యువ క్రికెటర్ నుంచి ఇలాంటి పరిణతితో కూడిన ఇన్నింగ్స్ రావడం నిజంగా ఇండియన్ క్రికెట్ భవిష్యత్తుగా శుభసూచికం. కెరీర్ ఆరంభంలో మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా కూడా.. సెంచరీ మార్క్‌ను అందుకోవడానికి ఇబ్బంది పడిన గిల్.. ఒక్కసారి సెంచరీ రుచి మరిగిన తర్వాత.. దాన్ని వదిలిపెట్టడం లేదు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కంటే ముందు భారత్.. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడింది. రోహిత్ శర్మ గాయంతో మూడో వన్డేకు దూరం కావడంతో.. ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న ఇషాన్.. ప్రపంచ రికార్డు బద్దలుకొడుతూ డబుల్ సెంచరీతో చెలరేగాడు.
కానీ.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌ను కాదని టీమ్ మెనేజ్‌మెంట్ గిల్‌నే రోహిత్‌కు జోడిగా ఓపెనింగ్‌స్థానంలో ఆడించింది. తనపై టీమ్ మెనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. గిల్ సైతం కివీస్‌తో తొలి వన్డేలో డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ సైతం సెంచరీ బాదాడు. ఇక రెండో వన్డేలోనూ స్వల్ప టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియాను గెలిపించాడు. మంగళవారం జరిగిన మూడో వన్డేలు సెంచరీతో చెలరేగాడు. ఇలా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతూ.. సెంచరీల వర్షం కురిపిస్తున్నాడు. అయితే.. గిల్ తన బ్యాటింగ్‌తోనే కాకుండా తనపై వచ్చే రూమర్స్‌తో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురి సారా టెండూల్కర్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ.. అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ.. ఆ తర్వాత ఇద్దరూ సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్‌తో గిల్ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. కొంతమంది నెటిజన్లు మాత్రం సందు దొరికితే సారాకు-గిల్‌కు ముడిపెడుతూ.. పోస్టులు చేస్తుంటారు. ఇప్పుడు ఈ అల్లరి సోషల్ మీడియాను దాటి స్టేడియం వరకు వ్యాపించింది. భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న గిల్‌ను ఉద్దేశిస్తూ.. సారా వదినా అంటూ ప్రేక్షకులు రచ్చరచ్చ చేశారు. వీరి అల్లరికి విరాట్ కోహ్లీ కూడా తోడై.. గిల్‌ను టీజ్ చేసుందుకు ప్రేక్షకులను మరింత ఎంకరేజ్ చేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) January 25, 2023