45 రోజులపైనే క్రికెట్ ప్రేమికులకు ఆనందాన్ని పంచే ఐపీఎల్ శనివారంతో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు జరిగిన 14 సీజన్లు కూడా క్రికెట్ అభిమానులను బాగా అలరించి.. సూపర్ హిట్‌గా నిలిచాయి. దీంతో ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అలాంటి లీగ్ ఈ ఏడాది కూడా అంతే క్రేజ్‌తో వినోదాన్ని పంచుతుందా? అంటే అనుమానమనే చెప్పాలి. ఉత్కంఠ భరితంగా మ్యాచ్‌లు జరిగినా కూడా.. మునుపటి ఆసక్తి ప్రేక్షకుల్లో ఉండేలా కనిపించడంలేదు. అందుకు ప్రధాన కారణం.. తమ పేరుతోనే జట్టుకు క్రేజ్ తెచ్చిన ఆటగాళ్లు ఆ టీమ్ కెప్టెన్లుగా తప్పుకోవడం.
ఐపీఎల్ 2022కు తాను ఆర్సీబీ కెప్టెన్‌గా ఉండడని టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. తాజాగా ఇండియాకు రెండు వరల్డ్ కప్‌లు, చెన్నైకు నాలుగు ఐపీఎల్ టైటిళ్లు అందించిన హీరో ఎంఎస్ ధోని కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఆర్సీబీ, సీఎస్‌కే ఈ రెండు జట్లకు ప్రారంభలోనే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిదంటే అందుకు కారణం కోహ్లీ, ధోనినే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆర్సీబీ ఇప్పటివరకు ఇక్క ఐపీఎల్ టైటిల్ గెలవనప్పటికీ ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ అదే. ఇలాంటి నేపథ్యంలో కోహ్లీ ఆ జట్టుకు హెడ్‌గా లేకుంటే ఆ క్రేజ్ కాస్త తగ్గే ప్రమాదం ఉంది. చెన్నై విషయంలోనూ అంతే.
ధోని సీఎస్‌కేకు బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడు. అతను కెప్టెన్‌గా లేకుంటే చెన్నై ఫ్యాన్ ఫాలొయింగ్ తగ్గుతుందనే అంచనా ఉంది. కెప్టెన్లుగా లేకున్నా.. జట్టులో సభ్యులుగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశమే.. అయినా కూడా ఎదో లోటులా కనిపిస్తుంది. దీనికి తోడు మిస్టర్ ఐపీఎల్‌గా పేరుతెచ్చుకున్న సురేష్ రైనా, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ లాంటి స్టార్ ప్లేయర్లు ఐపీఎల్‌కు దూరమవ్వడం కూడా కొంత దెబ్బే. ఇక కొత్తగా వచ్చిన కెప్టెన్లు దాదాపు యువకులే ఉన్నారు. దానికి తోడు ఏ ఆటగాడు ఏ జట్టులో ఉన్నాడో స్పష్టంగా తెలియని పరిస్థితి.
మెగా వేలంతో కొంతమంది ఆటగాళ్లు తప్పితే చాలా మంది జట్లు మారారు. దీంతో ప్రేక్షకుల్లో ఒకింత గందరగోళం ఉంటుంది. ఇది కూడా మ్యాచ్‌లు చూసేందుకు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇలా కొన్ని విషయాలు పరిశీలిస్తే.. ఐపీఎల్ 2022 చప్పగా ఉండబోతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. శనివారం చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ పండుగ ప్రారంభంకానుంది. మరి ఐపీఎల్ 2022పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై విరాట్ కోహ్లీ ఎమోషనల్ ట్వీట్
📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.