టీమిండియా సీనియర్ ప్లేయర్, స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను బీసీసీఐ ఘోరంగా అవమానించింది. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ కోసం అతన్ని కెప్టెన్‌గా ప్రకటించిన కొన్ని రోజులకే అతను నుంచి కెప్టెన్సీ లాక్కొని అసలు జట్టులోనే లేని కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్ మీడియాలో వ్యాప్తంగా బీసీసీఐపై విమర్శలపై వర్షం కురుస్తోంది.
జింబాబ్వేతో వన్డే సిరీస్‌తో జట్టును ప్రకటించినప్పుడు కేఎల్ రాహుల్ అందుబాటులో లేడు. ఫిట్‌నెస్ సమస్యలు, కరోనాతో జట్టుకు పూర్తిగా దూరమయ్యాడు. గాయానికి సర్జరీ తర్వాత కోలుకుని ఫిట్‌నెస్ సాధించినా.. తర్వాత అనూహ్యంగా కరోనా బారిన పడ్డాడు. తాజాగా గురువారం ఫిట్‌నెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో అతన్ని హుటాహుటిన జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో ఆడేంచేందుకు బీసీసీఐ ఎంపిక చేయడంతో పాటు.. కెప్టెన్సీ పగ్గాలు కూడా అప్పజెప్పుతున్నట్లు ప్రకటించింది.
దీంతో శిఖర్ ధావన్‌ను బీసీసీఐ ఘోరంగా అవమానించిదంటూ క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ జట్టులోకి తిరిగి రావడాన్ని క్రికెట్ అభిమానులు స్వాగతిస్తున్నా.. రాహుల్ కంటే ఎంతో సీనియర్ అయిన శిఖర్ ధావన్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఇంత హఠాత్తుగా తప్పించడంపై మాత్రం మండిపడుతున్నారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చి, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కరోనాతో ఉండడంతో సీనియర్ ప్లేయర్‌గా ఉన్న శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ.. జింబాబ్వే పర్యటనకు జట్టును ఎంపిక చేశారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఒక ఆటగాడు ఫిట్‌నెస్ సాధించగానే అప్పటికప్పుడు జట్టులో చోటు కల్పించడమే కాకుండా.. అల్రెడీ ప్రకటించిన కెప్టెన్‌ను కాదని చాలా కాలం తర్వాత జట్టులోకి వస్తున్న జూనియర్ ప్లేయర్‌కు బాధ్యతలు అప్పగించడం శిఖర్ ధావన్ ఎమోషన్స్‌తో ఆడుకోవడమే అని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. పైగా రాహుల్ కెప్టెన్సీలో టీమిండియాకు దారుణమైన ఓటములు ఉన్నాయి. అలాగే శిఖర్ ధావన్ ఇటివల వెస్టిండీస్‌ను వెస్టిండీస్‌లో మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్ చేశాడు. గతంలో కూడా పలు సార్లు టీమిండియాకు సిరీస్ విజయాలు అందించాడు.
కెప్టెన్‌గా మంచి రికార్డు ఉండి, సీనియర్ ప్లేయర్ అయిన ధావన్‌పై వివక్ష చూపిస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఆసియా కప్‌కు ముందు రాహుల్‌కు ప్రాక్టీస్ మ్యాచ్‌లలాగా జింబాబ్వే సిరీస్ ఉపయోగపడుతుందని జట్టులోకి తీసుకొచ్చారు అనుకున్నా.. అతను చాలా కాలం జట్టులో లేడు, అతన్ని జట్టులోకి తెచ్చింది బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం. అలాంటప్పుడు ధావన్ కెప్టెన్సీలో ప్రశాంతంగా బ్యాటింగ్‌పై ఫోకస్ చేట్టేలా చూడాలి కానీ, కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చి అదనపు భారం మోపడం ఎందుకంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
పైగా జింబాబ్వేను అంత తేలిగ్గా తీసుకోవద్దు.. ఇప్పటికే బంగ్లాదేశ్‌కు వణుకు పుట్టించింది. కెప్టెన్‌గా అంత ప్రభావం చూపలేని రాహుల్.. జింబాబ్వేతో సిరీస్‌లోనూ తన గత చెత్త రికార్డును కొనసాగిస్తే.. జింబాబ్వేపై టీమిండియా ఓడినా ఆశ్చర్యం లేదంటూ క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ధావన్ కెప్టెన్సీలో ఇటివల టీమిండియా 3-0తేడాతో వన్డే సిరీస్‌లో విండీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఈ సిరీస్‌లో ధావన్ వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా అద్భుంగా రాణించాడు. అలాగే వన్డే ఫార్మాట్‌లో అతను రెగ్యులర్ ప్లేయర్. అయినా ధావన్ పట్ల బీసీసీఐ పక్షపాత ధోరణి అవలంభిస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
NEWS – KL Rahul cleared to play; set to lead Team India in Zimbabwe.
More details here – https://t.co/GVOcksqKHS #TeamIndia pic.twitter.com/1SdIJYu6hv
— BCCI (@BCCI) August 11, 2022
ఇది కూడా చదవండి: ‘బయట కనిపించేదంతా నిజం కాదు..’ రాస్ టేలర్ ఆత్మకథలో సంచలన విషయాలు!