మన దేశంలో సెలబ్రిటీలకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా క్రికెటర్లు, సినిమా వాళ్లకు క్రేజ్ అయితే ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. వారు బయట కనిపిస్తే.. ఇంకేముంది.. ఎగబడిపోతారు. ఫోటోలు, సెల్ఫీలు అంటూ తెగ హాడావుడి చేస్తారు. మన సెలబ్రిటీలు స్వదేశంలో బయటకు వెళ్లాలంటే ఇబ్బంది పడతారు. అందుకే చాలా మంది ఎంజాయ్ చేయడానికి, షాపింగ్ వంటివి చేయడానికి విదేశాలకు వెళ్తారు. మరి కొందరు సెలబ్రిటీలకు విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అక్కడ కూడా అభిమానులు వారిని చుట్టుముడతారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనికి కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది. అభిమానుల నుంచి తప్పించుకోవడానికి ఏకంగా పారిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వివరాలు..
టీమిండియా మాజీ క్రికెటర్ ధోనికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన దేశంలో ధోని ఎక్కడైనా బయట కనిపిస్తేనే క్రికెట్ ఫ్యాన్స్హడావిడి మాములుగా ఉండదు. తాజాగా లండన్ వీధుల్లోనూ ధోనికి అదే అనుభవం ఎదురైంది. ఒక పని ముగించుకొని తన కారు వద్దకు వస్తున్న ధోనిని గుర్తుపట్టిన అభిమానులు అతనితో సెల్ఫీలు దిగేందుకు పరిగెత్తుకొచ్చారు. వారి నుంచి తప్పించుకునేందుకు ధోని కాస్త వేగంగా నడవడంతో అభిమానులు చేజింగ్ చేయడం మొదలెట్టారు. అయితే సెక్యూరిటీ సాయంతో ధోని తన కారులో అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ఒక అభిమాని శనివారం ట్విటర్‌లో షేర్ చేశాడు.
కాగా ధోని రెండు వారాల క్రితం తన కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి సరదాగా గడపడానికి ఇంగ్లండ్‌కు వెళ్లాడు. తన 41వ పుట్టినరోజు(జూలై 7న) కూడా అక్కడే జరుపుకున్నాడు. అటుపై టీమిండియా కూడా ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడేందుకు రావడంతో ఆ మ్యాచ్‌లు వీక్షించేందుకు కూడా ధోని వెళ్లాడు. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేకు ధోని సందడి చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్‌రూమ్‌లో పలువురు టీమిండియా ఆటగాళ్లను కలిసిన ఫోటోలు షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
. @MSDhoni in the streets of london 🔥🔥pic.twitter.com/aLEurgsClH
— Dhoni Army TN™🦁 (@DhoniArmyTN) July 16, 2022