రిషభ్ పంత్.. ప్రస్తుతం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న క్రికెటర్. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వారసుడిగా టీమిండియాలోకి అడుగుపెట్టిన పంత్.. అనతికాలంలోనే కీ ప్లేయర్‌గా ఎదిగాడు. గాబాలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీమిండియాకు చిరస్మరణీయ టెస్టు విజయాన్ని అందించాడు. దాంతో ఇండియన్ క్రికెట్‌లో పంత్ ఒక హీరోలా మారిపోయాడు. టెస్టుల్లో మంచి రికార్డు కలిగి ఉన్న పంత్.. ఎందుకో గాని వన్డేలు, టీ20ల్లో దారుణంగా విఫలం అవుతున్నాడు. రిషభ్ పంత్ కోసం దినేష్ కార్తీక్, సంజు శాంసన్ లాంటి ఆటగాళ్లను సైతం పక్కన పెట్టినా.. ఇప్పుడు వారి కెరీర్లకు పంత్ విలన్‌లా మారిపోయాడు. అందుకు కారణం.. వారిని కాదని తీసుకున్న పంత్ దారుణంగా విఫలం అవుతుండటమే.
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా దారుణంగా విఫలమైంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతా జట్టు మొత్తం ఫెయిల్ అయింది. అందులో పంత్ కూడా భాగమే. వరల్డ్ కప్ ముందు నుంచే పంత్ ఫామ్‌లో లేకపోయినా.. టీమ్‌లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఉండాలని అతన్ని జట్టులోకి తీసుకున్నారు. అలాగే.. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా ఆడించినా.. పంత్ ఫామ్ అందుకోలేకపోయాడు. వరల్డ్ కప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లో పంత్‌ను పక్కన పెట్టినా.. సూపర్ 12లో జింబాబ్వేతో, అలాగే సెమీస్‌లో పంత్‌కు అవకాశం ఇచ్చారు. కానీ.. పంత్ దాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినా కూడా వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేసి.. తుది జట్టులో ఆడిస్తున్నా.. దారుణంగా విఫలం అవుతున్నాడు.
తాజాగా కివీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో సైతం పంత్ దారుణంగా విఫలం అయ్యాడు. 16 బంతులాడి కేవలం 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే.. పంత్ పూర్ ఫామ్ కంటే కూడా అతని మైండ్ సరిగా లేదని క్రికెట్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు కారణం.. పంత్ అవుటైన విధానం. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్ వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. ధావన్(28), గిల్(13) పరుగుల చేసి అవుట్ అయ్యారు. దీంతో టీమిండియా 55 పరుగులకే ఓపెనర్లను కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఆచితూచి ఆడుతున్నాడు.
అలాగే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ సైతం కాస్త నిదానంగా తన శైలికి భిన్నంగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 15 బంతులాడి 2 ఫోర్లతో 10 పరుగుల వద్ద ఉన్న సమయంలో మిచెల్ ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్‌షాట్ ఆడాడు. అసలే పుల్‌షాట్ ఆడటంతో కాస్త వీక్ అయిన పంత్.. అనవసరంగా ఆ షాట్ ఆడి, వికెట్ సమర్పించుకున్నాడు. ఆ టైమ్‌లో పంత్ అలాంటి షాట్ ఆడాల్సిన అవసరమే లేదు. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ఆదుకోకుండా.. చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది టీ20 కాదు కదా.. రాగానే భారీ షాట్లు ఆడేందుకు. జట్టు పరిస్థితులు బట్టి కాస్త సమయం తీసుకుని ఆడొచ్చు. పైగా ఇంకా 30 ఓవర్లపైనే మిగిలి ఉన్నాయి.
ఇలాంటి టైమ్‌లో నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్‌కు ఎక్కువగా స్ట్రైక్ ఇస్తూ.. ఒక మంచి పార్ట్నర్‌షిప్ నెలకొల్పి ఉంటే జట్టు మంచి స్థితిలో ఉండేది. అలాగే ప్రస్తుతం ఫామ్‌లోలేని పంత్.. కాస్ట ఎక్కువ సమయం పిచ్‌పై గడిపి ఉంటే.. అతనికి కూడా కాన్ఫిడెన్స్ పెరిగి 60, 70 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నా.. ఫామ్ అందుకునే అవకాశం ఉండేది. నిదానంగా ఆడి తక్కువ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసినా జట్టుకు వచ్చే నష్టమేమి లేదు. ఎందుకంటే పంత్ ఒక్కసారి రిథమ్ అందుకుంటే.. ఎలాంటి విధ్వంసం సృష్టించగలడో అందరికి తెలిసిందే. పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్న సమయంలో పిచ్‌పై కాస్త టైమ్ గడపడంలో తప్పులేదని క్రికెట్ విశ్లేషకులతో పాటు మాజీ క్రికెటర్ల సైతం పలు సందర్భంల్లో చెబుతుంటారు. అలా కాకుండా.. కనీసం కామన్‌సెన్స్ లేకుండా బ్యాడ్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడంటూ పంత్‌పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇలాంటి చెత్త బ్యాటింగ్‌తో టీమ్‌కు భారంగా మారుతుండటంతో పాటు.. తన కెరీర్‌ను కూడా ప్రమాదంలో పడేసుకుంటున్నాడంటూ అతని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నాడు.
Pant out pic.twitter.com/pyQKrTnEFp
— Ratha_S (@Ratha0889) November 30, 2022