టీమిండియా యంగ్ టాలెంటెడ్ ప్లేయర్ సంజు శాంసన్ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. న్యూజిలాండ్‌తో బరిలోకి దిగకపోయినా.. క్రికెట్ అభిమానులు అతని గురించే చర్చించుకుంటున్నారు. కొంతమంది అయితే.. సంజు శాంసన్ అంతర్జాతీయ క్రికెట్ గుడ్‌బై చెప్పాలని కోరుకుంటున్నారు. అదేంటి ఇంకా చాలా భవిష్యత్తు ఉన్న ఆటగాడ్ని అప్పుడే రిటైర్మెంట్ ఇవ్వమని కోరడమేంటి? అనుకుంటున్నారా? ఈ డిమాండ్ వెనుక పట్టలేని కోపం, బాధ, ఆవేదన ఉన్నాయి. ఎంత టాలెంట్ ఉన్నా.. తుది జట్టులో ఆడే అవకాశం రాకపోవడంతో ఇంకెందుకు ఇక సంజు రిటైర్మెంట్ ఇస్తే సరిపోతుంది.. అంటూ సంజు అభిమానులు తమ కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుసగా విఫలం అవుతున్నా.. జట్టులోకి తీసుకుంటారు, కానీ.. మరో ఆటగాడికి మాత్రం అవకాశం ఇవ్వరూ.. అసలు సంజుపై ఎందుకీ వివక్ష అని కొంతమంది ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో సంజు శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంపైనే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కనీసం వరల్డ్ కప్ తర్వాత అంతమంది సీనియర్లుకు రెస్ట్ ఇచ్చిన తర్వాత అయినా ఆడే అవకాశం ఇవ్వడం లేదు. ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ తర్వాత.. టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ చూసి సగటు క్రికెట్ అభిమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. వరల్డ్ కప్‌లోనే స్థానం దక్కలేదని భాదపడుతుంటే.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ తుది జట్టులోకి సంజు శాంసన్‌ను తీసుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు.
SumanTV,su
వరుసగా విఫలం అవుతున్న రిషభ్ పంత్‌కు ఓపెనర్‌గా ఆడించి.. మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్న టీమిండియా.. ఓపెనర్‌గా మంచి రికార్డు ఉన్న సంజు శాంసన్‌ను పక్కనపెట్టింది. పైగా ఇషాన్ కిషాన్‌తో పంత్‌ను ఓపెనర్‌గా పంపించారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ల కంటే రైట్, లెఫ్ట్ కాంబినేషన్ ఉత్తమమనే కనీసం అవగాహన కూడా టీమిండియా కోచ్, కెప్టెన్‌కు లేదా అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్‌లో, దేశవాళీ టోర్నీల్లో, ఇండియా-ఏ జట్టలకు ఆడి ఎంత అద్భుతమైన ప్రదర్శనలు చేసినా.. సంజు శాంసన్‌కు ప్రతిసారి అన్యాయమే జరుగుతోంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్‌లో చెత్త ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న టీమిండియా మేనేజ్‌మెంట్.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ అదే మూస ధోరణి అవలంభిస్తోంది.
ధోని తర్వాత.. టీమిండియాలో బ్యాటర్ కమ్ వికెట్ కీపర్‌గా చేసిన వారిని ఒక సారి పరిశీలిస్తే.. సంజుకు ఎంత అన్యాయం జరుగుతుందో స్పష్టంగా అర్థం అవుతోంది. దినేష్ కార్తీక్ లాంటి వెటరన్ ప్లేయర్‌ను పక్కనపెడితే.. కేఎల్ రాహుల్ 2016లో జట్టులోకి వచ్చి 72 మ్యాచ్‌లు ఆడాడు, అలాగే రిషభ్ పంత్ 2017లో వచ్చి 64 మ్యాచ్‌లు ఆడాడు, ఇక గతేడాది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌కు కూడా అప్పుడే 19 మ్యాచ్‌ల్లో అవకాశం ఇచ్చారు. కానీ.. 2015లో వీరందరి కంటే ముందు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంజూ శాంసన్‌కు మాత్రం కేవలం 16 మ్యాచ్‌ల్లో ఆడించారు. ఈ లెక్కలు చాలవా సంజు శాంసన్‌కు అన్యాయం జరిగిందని చెప్పడానికి అంటూ సంజు ఫ్యాన్స్‌తో పాటు సగటు క్రికెట్ అభిమానులు సైతం మండిపడుతున్నారు. మరి కనీసం చివరి టీ20లో అయినా సంజు శాంసన్‌కు అవకావం ఇస్తారో లేదో చూడాలి.
u gotta feel for this manh🥺 if u r true cricket fan.
SHAME for these acts from #BCCI…#Sanju #indvsnzlive #SanjuSamson #RishabhPant pic.twitter.com/RbxvL42saU
— Aftu (@aftu_twts) November 20, 2022
A selfie with fans by Sanju Samson. pic.twitter.com/pGwvvAhUrD
— Johns. (@CricCrazyJohns) November 20, 2022
Even rain gods are unhappy today with the exclusion of Sanju Samson from the playing 11 and crying tears of pain after seeing quota player Pant’s batting.😢😢#INDvsNZ#NZvIND#SanjuSamson pic.twitter.com/4GPT6VS1Lj
— falling st7r (@i_Falling_Star) November 20, 2022
Sanju Samson has quite a lot of following in NZ. Hopefully he will get a game in the series. #NZvIND #SanjuSamson pic.twitter.com/7tcxDXB4Vl
— Indian Sports Fans (@indiasuperfans) November 20, 2022
I still can’t believe Kishan and Pant are picked over him. Ok forget abt keeping, why is Hooda picked over him? IT companies ki bench pe bhi itna koi nahi rehta. @BCCI #SanjuSamson #indvsnzlive #indvsnz pic.twitter.com/FC9xxq65F0
— Srinivas Soni (@sonisr) November 20, 2022