నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత్‌కు రావాల్సి ఉంది ఆస్ట్రేలియా జట్టు. అయితే.. ఈ సిరీస్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య మార్చిలో యూఏఈ వేదికగా మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. దీని కోసం ఇరు జట్లుకు కూడా సమాయత్తం అవుతున్నాయి. ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీమ్‌తో వన్డే సిరీస్ ఆడటంతో వన్డేల్లో తమను వృద్ధి చేసుకుందామని ఆఫ్ఘాన్ టీమ్ భావించింది. పైగా ఇదే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ 2023 కోసం కూడా ఒక మంచి సన్నాహ సిరీస్‌గా ఆసీస్‌తో మ్యాచ్‌లు ఉపయోగపడతాయని ఆఫ్ఘాన్ టీమ్ ఆశించినా.. ఆసీస్ క్రికెట్ బోర్డు వారి ఆశలపై నీళ్లు చల్లింది.
యూఏఈ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడాల్సిన మూడు వన్డేల సిరీస్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు గురువారం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వెల్లడించింది. అయితే.. ఈ సిరీస్ రద్దుకు ఒక బలమైన కారణం చూపించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై విధిస్తున్న ఆంక్షలను వ్యతిరేకిస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ పేర్కొంది. మహిళలను క్రికెట్ ఆడనీయకుండా వారిపై ఆంక్షలు విధుస్తున్నందుకు ఈ సిరీస్ రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. అలాగే ఆ దేశంలో మహిళల హక్కులను కాలరాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, విద్యను సైతం దూరం చేస్తున్నందున ఆఫ్ఘాన్‌తో సిరీస్ ఆడకూడదని తమ ప్రభుత్వం తెలిపిందని.. వారి మద్దతుతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ వెల్లడించింది.
కాగా.. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు ప్రభుత్వం స్థాపించారు. అప్పటి నుంచి అక్కడి మహిళలపై కఠినమైన నిషేధాలు కొనసాగుతున్నాయి. ఇటివల యూనివర్సిటీ విద్యకు సైతం మహిళలను దూరం చేశాడు. అలాగే.. జాతీయ మహిళా క్రికెట్ టీమ్ లేకుండా ఐసీసీలో సభ్యత్వం ఉన్న ఏకైక దేశం ఆఫ్ఘనిస్థానే. అయితే.. టీ20 వరల్డ్ కప్‌కు ముందు మహిళల క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోకుంటే.. ఆఫ్ఘనిస్థాన్‌పై బ్యాన్ విధిస్తామని అప్పట్లో ఐసీసీ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియా వన్డే సిరీస్ రద్దు చేసుకున్న నేపథ్యంలో మరో సారి ఆఫ్ఘాన్‌లో మహిళా క్రికెట్ అభివృద్ధిపై విచారణ జరుపుతామని ఐసీసీ తెలిపింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Australia has abandoned their ODI series against Afghanistan due to the Taliban’s recent announcement on women and girls’ education and employment.#Australia #Afghanistan #AfghanistanCricketTeam #ODI #ODIs #AUSvAFG #AUSvsAFG #Cricket #Sportsbettingmarkets pic.twitter.com/AtmVktgJoE
— Sportsbettingmarkets.com (@Sbettingmarkets) January 12, 2023