ప్రపంచ వ్యాప్తంగా కొరలు చాస్తున్నకరోనా మహమ్మారి యావత్ ప్రజానికానికి చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికి అన్ని రంగాల్లో చాలా మంది ప్రముఖులు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎంతో మంది నటులు కరోనా వైరస్‌తో మరిణించారు. ఇక తాజాగా టీంఇండియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కూడా కరోనా వదలలేదు.
పంత్‌కు కరోనా పాటిటివ్ వచ్చిందని ఓ ప్రముఖ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నఆయన కరోనా నిర్ధారణ కావటంతో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాడు. ఇక పంత్ కొన్ని రోజుల కిందట వెంబ్లే స్టేడియం పరిసర ప్రాంతాల్లో కొంతమంది స్నేహితులతో కలిశాడు. దీంతో అక్కడ ఉన్న స్నేహితులతో కరోనా సోకి ఉండవచ్చిన తన సన్నిహితులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చేంత వరకు పంత్ క్రికెట్‌కు దూరంగా ఉండాలి.
దీంతో రానున్న రోజుల్లో జరగనున్న కొన్ని మ్యాచ్‌లకు పంత్ దూరంగా ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ దెబ్బతో టీం ఇండియాకు కాస్త నష్టమనే చెప్పాలి. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండటంతో కేసుల సంఖ్య క్రమంగా క్షీణిస్తున్నాయి.