ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఉత్కంఠంగా సాగింది.. ఈ ఆటలో అనుకోని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దూకుడు పై ఉండగా ఒక క్యాచ్ వివాదం అయ్యింది.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అనుకోని మలుపులు తీసుకుంటుంది. టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ ఎలాంటి మ్యాచ్ కోరుకుంటారో ఆలాంటి మ్యాచ్ కే పాత్ సెట్ అయ్యింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా డ్రా కోసం కాకుండా గెలుపు కోసం ప్రయత్నిస్తుండటంతో ఫైనల్ మ్యాచ్ లో అసలైన మజా స్టార్ట్ అయ్యింది. గేమ్ ఇంత బాగా సాగిపోతున్న వేళ థర్డ్ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి టచ్ లో కనిపించిన గిల్ ని.. ఓ వివాదాస్పద క్యాచ్ తో అంపైర్ అవుట్ గా ప్రకటించడంతో అసలు రచ్చకి తెర లేచినట్టు అయ్యింది.
గెలుపే లక్ష్యంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండియాకి ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. రోహిత్-గిల్ జోడీ ఆసీస్ బౌలర్లు పై ఎదురుదాడికి దిగడంతో 7 ఓవర్లులోనే 40 పరుగులు వచ్చేశాయి. నెట్ రన్ రేట్ 6పై ఉండటం.. గిల్, రోహిత్ జోడీ క్రీజ్ లో నిలదొక్కుకొని పోవడంతో అందరికీ గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ.. ఇలాంటి దశలోనే థర్డ్ అంపైర్ చేసిన ఘోర తప్పిదం భారత్ కొంపముంచింది. 19 బంతుల్లోనే 18 పరుగులు చేసిన గిల్.. బొలాండ్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడబోయి కామెరూన్ గ్రీన్ కి క్యాచ్ ఇచ్చాడు. కానీ.., ఆ క్యాచ్ అంత స్పష్టంగా లేకపోవడంతో గిల్ డీఆర్‌ఎస్ తీసుకున్నాడు. అంపైర్స్ కూడా మరింత స్పష్టత కోసం థర్డ్ అంపైర్ కి రిఫర్ చేశారు.
టీవీ రిప్లైలో గ్రీన్ క్యాచ్ సరిగ్గా పట్టలేదని స్పష్టంగా అర్ధం అయ్యింది. గ్రీన్ చేతిలో పడే ముందే బాల్ గ్రౌండ్ కి టచ్ అయినట్టు స్పష్టంగా కనిపించింది.కానీ.., థర్డ్ అంపైర్ అన్నీ యాంగిల్స్ లో చూసి దీన్ని అవుట్ గా ప్రకటించడంతో అంతా షాక్ కు గురి అయ్యారు. దీంతో టీ బ్రేక్ కి ముందు భారత్ కి తొలి దెబ్బ తగిలినట్టు అయ్యింది. సాఫీగా సాగిపోతున్న ఇన్నింగ్స్.. ఇలా అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఒక్కసారిగా మారిపోవడం టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఇంత దారుణమైన అంపైరింగ్ ఏంటి? వాళ్ళకి కళ్ళు కనిపించడం లేదా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక నెటిజన్స్ అయితే అరగంట వ్యవధిలోనే నాటౌట్ అంటూ 5 లక్షల ట్వీట్స్ చేసి తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది క్యాచ్ అందుకున్న గ్రీన్ ని చీటర్ అంటూ గ్రౌండ్ లోనే బాహాటంగా విమర్శిస్తున్నారు. మరి.. గిల్ అవుట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The Oval crowd started chanting ‘cheater, cheater’ after the 3rd umpire’s decision. pic.twitter.com/JE3P603kpD
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2023