దాదాపు 36 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అర్జెంటీనాకు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ అందించాడు లియోనెల్ మెస్సీ. ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022లో అర్జెంటీనా.. డిఫెండింగ్ ఛాంపియన్‌పై గెలిచి విశ్వవిజేతగా అవతరించింది. దోహాలోని లుసైల్‌లో జరిగిన ఫైనల్లో మెస్సీ తొలి గోల్‌తో మ్యాచ్ ఆరంభంలోనే అర్జెంటీనాను అధిక్యంలోకి తీసుకొచ్చాడు. అయితే ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె సైతం హ్యాట్రిక్ గోల్స్‌తో విరుచుకుపడి.. అర్జెంటీనాను అంత ఈజీగా గెలువనివ్వలేదు. చివరి ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ మ్యాచ్ టైగా మారడంతో పెనాల్టీ షూట్ అవుట్‌లను ప్లాన్ చేశాడు. ఈ పెనాల్టీ షూట్ అవుట్‌లో అర్జెంటీనా 4-2తో విజయం సాధించి.. రెండో సారి ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను ముద్డాడింది. 1986లో మారాడోనా సారథ్యంలో వరల్డ్ కప్ నెగ్గిన అర్జెంటీనా.. మళ్లీ 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా వరల్డ్ కప్ గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా మారింది.
అయితే.. అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవడంలో మెస్సీ కీలక పాత్ర పోషించాడు. 2006లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన మెస్సీ.. అప్పటి నుంచి అర్జెంటీనాకు వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 2014లో ఫైనల్ వరకు వెళ్లినా.. మెస్సీ కల నెరవేరలేదు. అయినా పట్టువదలకుండా.. ఖతర్ వేదికగా జరిగిన ఈ వరల్డ్ కప్‌లో తన జీవితకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు మెస్సీ. టోర్నీలో అత్యధిక గోల్స్‌తో గోల్డెన్ బాల్ అందుకున్న మెసీ.. అర్జెంటీనా కెప్టెన్‌గా 15 అంగుళాల బంగారు వరల్డ్ కప్‌ను అపూరంగా ముద్దాడి.. చేతుల్లోకి తీసుకున్నాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. ఇక మెస్సీ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిన్నటి ఆదివారం వారికి ఎంతో ప్రత్యేకం. మెస్సీ తొలి వరల్డ్ సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. సోషల్ మీడియా శుభాకాంక్షలతో నిండిపోయింది.
అయితే.. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీ చేసిన ఒక ట్వీట్ మాత్రం మరింత వైరల్ అయింది. వరల్డ్ కప్ గెలవడంపై లియోనెల్ మెస్సీకి కంగ్రాట్స్ చెబుతూ.. అస్సాంతో నీకు అనుబంధం ఉన్నందుకు గర్వంగా ఉందంటూ.. అస్సామ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖాలిఖ్ ట్వీట్ చేశారు. దీనికి ఒక యూజర్ నిజామా? మెస్సీకి అస్సామ్‌తో ఏంటి సంబంధం అని ప్రశ్నించగా.. అతను అస్సాంలోనే పుట్టాడంటూ మరో ట్వీట్ చేస్తూ.. బదులిచ్చాడు. క్షణాల్లోనే ఆయన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఖాలిఖ్ వాటిన డిలీట్ చేశారు. కానీ.. ఆయన ముందు ట్వీట్ చేసిన వాటిని స్క్రీన్‌షాట్లు తీసిని కొంతమంది నెటజన్లు.. వాటిని సోషల్ మీడియాలో మళ్లీ పోస్ట్ చేస్తున్నారు. అయితే.. వీటిపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది. మరి ఖాలిఖ్ చేసిన ఈ ట్వీట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
असम के बरपेटा से कांग्रेस सांसद ‘Abdul Khaleque’ का कहना है कि
मशहूर फ़ुटबॉलर #Messi का जन्म Assam में हुआ था। 😬 pic.twitter.com/j1P7Mf3DIO
— Shubhankar Mishra (@shubhankrmishra) December 19, 2022