చాలా కాలం తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన క్రీడల్లో ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ టీమ్‌తో ఇండియన్ ఉమెన్స్ టీమ్ తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. గెలుపు కోసం భారత మహిళా జట్టు ఆఖరి వరకు పోరాడినా.. ఆష్లే గార్డ్‌నర్ 52 పరుగులతో అజేయంగా నిలిచి ఆసీస్‌ను గెలిపిచింది.
దీంతో కామన్వెల్త్ క్రీడల్లో విజయంతో శుభారంభం ఇవ్వాలని భావించిన టీమిండియాకు నిరాశే ఎదురైంది. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ రేణుక సింగ్ ఠాకూర్ మాత్రం తన బౌలింగ్‌తో ఆసీస్‌ను వణికించింది. 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. రేణుక ధాటికి ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. మ్యాచ్ రెండో బంతికే ఓపెనర్ అలిసా హేలీను అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించిన రేణుక.. వరుసగా బెత్ మూనీతో పాటు.. కెప్టెన్ మెగ్ లానింగ్, తాహిలా మెగ్రాత్ వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా ఐదో ఓవర్ తొలి బంతికి మెగ్రాత్‌ను రేణుక అవుట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.
సూపర్ ఇన్‌స్వింగర్‌తో మెగ్రాత్‌ను రేణుక బౌల్డ్ చేసింది. దీంతో ఖంగుతిన్న మెగ్రాత్ కొద్దిసేపు అలానే చూస్తూ ఉండిపోయింది. అయితే, గార్డ్‌నర్‌కు తోడు గ్రేస్ హ్యారిస్ 37 పరుగులతో రాణించడంతో విజయం ఆసీస్ సొంతమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆసీస్ 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా టీమిండియా తమ తదుపరి మ్యాచ్ ఆదివారం పాకిస్థాన్‌తో ఆడనుంది. మరి ఆసీస్‌తో టీమిండియా మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝗨𝗻𝘀𝘁𝗼𝗽𝗽𝗮𝗯𝗹𝗲! 🔥
Renuka Singh Thakur, everyone. 👏#INDvAUS | #B2022 pic.twitter.com/zfo50r1QLj
— Olympic Khel (@OlympicKhel) July 29, 2022