అంతర్జాతీయ క్రికెట్‌కు మరో స్టార్ ఆల్‌రౌండర్ వీడ్కోలు పలికాడు. ఇప్పటికే న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ రాస్ టేలర్ ఆట గుడ్ బై చెప్పగా.. తాజాగా మరో కివీస్ స్టార్ ప్లేయర్ కొలిన్ డి గ్రాండ్‌హూమ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కొలిన్ రిటైర్మెంట్ విషయాన్ని ఆ దేశ అపెక్స్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కొలిన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించి.. అతనితో చర్చించిన తర్వాత రిటైర్మెంట్ నిర్ణయాన్ని అంగీకరించినట్లు బోర్డు వెల్లడించింది.
ఈ సందర్భంగా కొలిన్ మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్‌కు ఇన్నాళ్లపాటు ఆడే అవకాశం లభించడం నా అదృష్టం. 36 ఏళ్ల నాకు శిక్షణ తీసుకోవడం కష్టమవుతుంది.. గాయాలు వేధిస్తున్నాయి. అందుకే అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. అలాగే నా కుటుంబంతో సమయం కేటాయించాలని అనుకుంటున్నాను. ఇక క్రికెట్ తర్వాత నా మిగతా జీవితాన్ని ఎలా గడపాలని.. నేను చాలా కాలంగానే ఆలోచిస్తున్నాను. ఇన్ని రోజుల నేను ఆడిన ఆటకు గర్వంగానే ఉంది. ఇక తన కెరీర్‌కు ముగింపు పలికేందుకు ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను.’ అని అన్నాడు. ఇక కొలిన్ తన కెర్‌ర్‌లో మొత్తంగా 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై సెంచరీలతో సహా 38.70సగటుతో 1432 రన్స్ సాధించాడు. అతని అత్యుత్తమ స్కోరు 120 నాటౌట్. అలాగే టెస్టుల్లో అతను 32.95 సగటుతో 49 వికెట్లు కూడా తీశాడు. అలాగే 45 వన్డేలు, 41 టీ20లు కూడా ఆడాడు. మరి కొలిన్ రిటైర్మెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: సూర్యకుమార్ యాదవ్ అంపైర్‌గా పోటీ పడ్డా ఆవేశ్ ఖాన్, అర్షదీప్ సింగ్!
Just in: New Zealand cricketer Colin de Grandhomme has announced his retirement from international cricket pic.twitter.com/tGgaWE5fcl
— ESPNcricinfo (@ESPNcricinfo) August 31, 2022