టీమిండియా స్టార్ క్రికెటర్, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ దంపతులు ప్రస్తుతం తమ ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అటు క్రికెట్ వర్గాలు, ఇటు బాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఓ వార్త బాగా ప్రచారంలో ఉంది. అదేంటంటే.. కోహ్లీ- అనుష్క దంపతులు సెకెండ్ చైల్డ్ ప్లానింగ్ లో ఉన్నారంట. ఆ ప్రచారం ఊరికే మొదల్లవలేదులెండి.. అందుకు కారణం కూడా ఉంది. కోహ్లీ- అనుష్కలు ఇటీవల మాల్దీవుల్లో వెకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లు మాల్దీవుల నుంచి తిరిగి రాగానే నేరుగా ఆస్పత్రికి పరుగులు పెట్టారు.
అంతేకాకుండా ఆస్పత్రి నుంచి బయటకురాగానే అనుష్క శర్మ నవ్వుతూ కారు ఎక్కడంతో అంతా తమకు నచ్చిన విషయాలు ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు. అయితే నిజానికి క్రికెట్, ముంబై సినిమా వర్గాల్లో జరుగుతున్న ప్రచారాల్లో ఎంత వరకు నిజం ఉందంటే? అసలు ఆ ప్రచారాల్లో నిజమే లేదు. అనుష్క శర్మ, కోహ్లీ దంపతులు ఫిజియోథెరపిస్ట్ ను కలిసేందుకు ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి వెళ్లారు. దంపతులు ఇద్దరూ వెకేషన్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లడంతో ఈ ప్రచారం మొదలైంది.
ఇంక అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ కెరీర్ల విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ టూర్ కోసం విరాట్ కోహ్లీ ఫ్లైట్ ఎక్కేశాడు. ఇంగ్లాండ్ తో 1 టెస్టు, 3 టీ20లు, 3 వన్డేల్లో టీమిండియా తలపడనుంది. జూన్ 24 నుంచి జులై 17 వరకు ఈ టూర్ కొనసాగనుంది. అనుష్క శర్మ సినిమాల విషయానికి వస్తే.. ‘చక్దా ఎక్స్ ప్రెస్’ అనే క్రికెట్ బ్యాక్‌డ్రాప్ కథలో లీడ్ రోల్ లో నటిస్తోంది. అనుష్క శర్మ- విరాట్ కోహ్లీ విషయంలో నడుస్తున్న ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.