ఎప్పుడైతే వరల్డ్ క్రికెట్ లోకి IPL ప్రవేశించిందో.. అప్పటి నుంచి క్రికెట్ కు ఉన్న ఫాలోయింగే మారిపోయింది. అదీకాక ప్రపంచ క్రికెట్ లోకి కొత్త కొత్త యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ వచ్చారు. అయితే ఎంత మంది వచ్చినప్పటికీ ఐపీఎల్ లో క్రేజ్ తగ్గని ఒకే ఒక్క బ్యాటర్ విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్. క్రికెట్ అభిమానులు ముద్దుగా ‘యునివర్సల్ బాస్’ అని పిలుచుకుంటారు. ఇక గేల్ క్రీజ్ లో ఉంటే ఎంతటి బౌలర్ కైనా చమటలు పట్టడం ఖాయమే. ఇక అలవోకగా సిక్స్ లు కొట్టడంలో గేల్ మించిన బ్యాటర్లు ప్రపంచలో లేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఐపీఎల్ లో సుదీర్ఘకాలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కు ప్రాతినిధ్యం వహించాడు గేల్. అయితే కొంత కాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న గేల్.. తాజాగా RBC ఫ్రాంఛైజీపై విమర్శలు చేశాడు. బెంగళూర్ టీమ్ ను వదిలి వెళ్లడాన్ని ప్లేయర్స్ ఎంజాయ్ చేస్తారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).. ఐపీఎల్ లో ఈ టీమ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత ఫాలోయింగ్ ఉన్నాగానీ ఒక్కసారి కూడా కప్ కొట్టకుండా ప్రతీ సీజన్ లో అభిమానులును నిరుత్సాహ పరుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే RCB ఫ్రాంఛైజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు యునివర్సల్ బాస్ క్రిస్ గేల్. బెంగళూరు టీమ్ లో ఆటగాళ్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయని, జట్టును నడిపించే విధానం కార్పోరేట్ స్టైల్లో ఉంటుందని గేల్ అన్నాడు. అయితే జట్టులో మాత్రం బాండింగ్ కనిపించదని గేల్ చెప్పుకొచ్చాడు. ఎంత డబ్బు ఉన్నాగానీ అనుబంధం లేకపోతే వేస్ట్ అని అభిప్రాయ పడ్డాడు గేల్.
ఇక RCB.. ఆటగాళ్ల విషయంలో విధేయత, నమ్మకం అనే రెండు విషయాలు నేర్చుకోవాలని గేల్ సూచించాడు. ఈ రెండు విషయాలు చెన్నై సూపర్ కింగ్స్ నుంచి నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. RCBతో పాటుగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కూడా ఈ విషయాలు అలవర్చుకోవాలని ఈ సందర్భంగా అన్నాడు. ఇదిలా ఉంటే.. రాయల్ ఛాలెంజర్స్ లో కేవలం విరాట్ కోహ్లీ, డివిల్లియర్స్ కు మాత్రమే గౌరవం దక్కుతోంది అని షాకింగ్ కామెంట్స్ చేశాడు క్రిస్ గేల్. ఇక మిగిలిన ప్లేయర్స్ వాళ్లు చెప్పింది చేయాల్సిందేనని, అందుకే ఆర్ సీబీ నుంచి బయటకు వెళ్లడానికి ఏ ప్లేయర్ కూడా బాధపడడని విండీస్ స్టార్ గేల్ పేర్కొన్నాడు. ఒక విధంగా వారు సంతోషం వ్యక్తం చేస్తారని చెప్పుకొచ్చాడు.
Big Statement by Chris Gayle on PBKS & RCB 😮#Cricket #CricketTwitter #ChrisGayle pic.twitter.com/j27Gn2tZEg
— The Third Man Cricket Show (@ThirdCricket) January 28, 2023
అయితే గతంలో కూడా బెంగళూరు జట్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేఎల్ రాహుల్, షేన్ వాట్సన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. ఇక రాయల్ ఛాలెంర్స్ తరపున 8 సీజన్స్ ఆడిన గేల్ 4వేలకు పైగా పరుగులు సాధించాడు. అయితే 2018 సీజన్ లో గేల్ ను వేలానికి వదిలేసింది బెంగళూరు. అప్పటి నుంచి 2021 దాక మూడు సీజన్లు పంజాబ్ కు ప్రాతినిధ్యం వహించాడు గేల్. ప్రస్తుతం క్రికెట్ నుంచి విరామం తీసుకున్న గేల్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. మరి గేల్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Former RCB & PBKS Player Chris Gayle feels that most of the players don’t connect with these teams as part of family. pic.twitter.com/ZJyx3VD0K2
— Dr. Cric Point 🏏 (@drcricpoint) January 27, 2023