ఐపీఎల్‌లోని అన్ని జట్ల కంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమ్ ఆర్సీబీ. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, గేల్ లాంటి ఆటగాళ్లు కలిసి ఆడినా.. ఆ జట్టు కప్ కొట్టలేకపోయింది. దానికి కారణం ఏంటో క్రిస్ గేల్ వెల్లడించాడు. అదేంటో తెలుసుకోండి..
మరికొన్ని రోజుల్లో ధనాధన్ క్రికెట్ లీగ్.. ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ కోసం ఇప్పటికే అన్ని జట్లు సంసిద్ధం అవుతున్నాయి. టీమిండియా ప్రధాన ఆటగాళ్లు మినహా మిగతా టీమ్ సభ్యులు చాలా వరకు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ అయితే.. ప్రాక్టీస్‌లో అందరి కంటే ముందు. ఇక ఐపీఎల్ భారీ క్రేజ్ ఉన్న జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కూడా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆర్సీబీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సారి ఎలాగైనా కప్ సాధించాలని ఆర్సీబీ ఫ్రాంచైజ్ సైతం బలంగా కోరుకుంటుంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీ జట్టు హాట్ ఫేవరెట్‌గా, పటిష్టమైన జట్టుగా, భారీ క్రేజ్ ఉన్న టీమ్‌గా ప్రతి ఐపీఎల్ సీజన్‌కు ఎంట్రీ ఇస్తోంది. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ జట్టు ఛాంపియన్‌గా నిలువలేకపోయింది. పైగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ జట్టుకు చాలా కాలం పాటు కెప్టెన్‌గా ఉండటం కూడా ఆర్సీబీపై భారీ అంచనాలు ఏర్పడేందుకు కారణం. ఇప్పటికే 15 సీజన్లుగా టైటిల్ కోసం పోరాటం చేస్తున్న ఆర్సీబీ.. మరోసారి ఫ్రెష్‌గా 16వ సీజన్ బరిలోకి దిగబోతుంది. అయితే.. ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతేడాది అతని కెప్టెన్సీలోనే ఆర్సీబీ ఆడింది.
కానీ, గతంలోలాగే 2022లోనూ ఆర్సీబీ రాత మారలేదు. కెప్టెన్ మారిన అదే దరిద్రం. అయితే.. పెద్ద పెద్ద స్టార్లు ఉండి, ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే ఆటగాళ్లు ఉండి, ఏ టీమ్‌కు లేని ఫ్యాన్స్ సపోర్ట్ ఉండి కూడా ఆర్సీబీ కప్పు కొట్టలేకపోతుంది. అందుకు కారణం ఏంటో.. ఇప్పటికీ ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. అయితే.. ఆ జట్టు మాజీ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ మాత్రం ఆర్సీబీ కప్ ఎందుకు కొట్టలేకపోతుందో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. ఆర్సీబీలో చాలా మంది ఆటగాళ్లు తాము జట్టులో భాగమని అనుకోరు. అందుకు కారణం.. అందరి దృష్టి కేవలం విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియన్స్, తనపై ఉండేదని గేల్ పేర్కొన్నాడు. దీంతో.. జట్టులోని మిగతా ఆటగాళ్లు అసలు తాము జట్టులో ఉన్నామా? అనే భావనకు గురయ్యేవారు. ఆటగాళ్లలో ఉండే ఈ భావనతో ఒక జట్టుకు ఆర్సీబీ లీగ్‌లో ఆడేందుకు సమస్యగా మారేంది. అందుకే ఆర్సీబీ ఇప్పటి వరకు కప్ గెలవకపోవాడని ప్రధాన కారణం అని గేల్ వెల్లడించాడు. మరి ఆర్సీబీ కప్ కొట్టలేకపోవడానికి గేల్.. తనతో పాటు కోహ్లీ, డివిలియర్స్ క్రేజ్‌నే కారణంగా చూపాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Chris Gayle reveals the reason behind RCB’s failure in IPL.
📸: IPL/BCCI pic.twitter.com/F3lUmMM93g
— CricTracker (@Cricketracker) March 19, 2023