క్రిస్ గేల్ తాను టీ20ల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డుని (175)ని బద్దలు కొట్టే సామర్థ్యం అతడికే ఉంది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ 2023 ఐపీఎల్ లో అతడు నా రికార్డును బ్రేక్ చేస్తాడని జోస్యం చెప్పాడు గేల్. మరి ఆ బ్యాటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్లో కొన్ని రికార్డులు చాలాకాలం వరకు పదిలంగా ఉంటాయి. వీటిని బద్దలు కొట్టడానికి ఎవరూ కూడా అంత సాహసం చేయరు. దీనికి కారణం వీరి రికార్డులు అందనంత దూరంలో ఉండడమే. అయితే క్రికెట్లో ఎన్ని రికార్డులు ఉన్నా.. వివిధ ఫార్మాట్ లో బ్యాటర్లు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోర్లు బ్రేక్ చేయడం దాదాపుగా అసాధ్యమే. లారా టెస్టుల్లో సంచలనం సృష్టించిన 400 పరుగులు, రోహిత్ శర్మ వన్డేల్లో చెలరేగి ఆడిన 264 పరుగులు, టీ 20 క్రికెట్లో గేల్ విద్వంసకర ఇన్నింగ్స్ ఆడి చేసిన 175 పరుగులు ఈ లిస్టులో ఉన్నాయి. వీటిలో లారా రికార్డ్ చెక్కుచెదరకుండా దాదాపు 20 సంవత్సరాలు దాటేసింది. ఇక రోహిత్ శర్మ, గేల్ రికార్డులు 10 ఏళ్ళు గడిచినా.. ఇంకా వాటి దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేకపోయారు. ఇదిలా ఉండగా.. తాజాగా క్రిస్ గేల్ తాను టీ 20ల్లో సాధించిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డుని (175)ని భారత్ క్లాసిక్ బ్యాటర్ కేఎల్ రాహుల్ బద్దలు కొట్టే అవకాశం ఉందని తెలియజేశాడు.
దాదాపు 10 సంవత్సరాల క్రితం.. 2013 ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో క్రిస్ గేల్ బ్యాటింగ్ ధాటికి టీ20 రికార్డులన్నీ దాసోహమయ్యాయి. ఈ మ్యాచ్ లో గేల్ 175 పరుగులతో పాటుగా… తక్కువ బంతుల్లో(30) సెంచరీ, అత్యధిక సిక్సులు (17) లాంటి రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డులన్నీ ఇప్పటికీ పదిలంగా ఉండడం విశేషం. బ్రెవిస్(162), మసకద్జా (164) గేల్ రికార్డుకి చేరువగా వచ్చినా.. ఈ యూనివర్సల్ బాస్ రికార్డుని అధికమించలేకపోయారు. అయితే.. ఇటీవలే గేల్ మాట్లాడుతూ.. “కేఎల్ రాహుల్ మాత్రమే నా రికార్డుని బ్రేక్ చేయగలడు. అతనికే ఈ సామర్ధ్యం ఉంది. 2023 ఐపీఎల్లో ఒక భారీ ఇన్నింగ్స్ తో రాహుల్ నా రికార్డ్ బ్రేక్ చేస్తాడు. అతను బరిలోకి దిగినప్పుడు చాలా ప్రమాదకరం” అని చెప్పుకొచ్చాడు. బట్లర్, సూర్య కుమార్ యాదవ్ లతో పాటు చాలామంది మంది టీ20 స్పెషలిస్టు బ్యాటర్లు ఉన్నా కూడా గేల్.. రాహుల్ పేరు చెప్పడం విశేషం.
ఇక రాహుల్ నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 75 పరుగులు చేసి టీమిండియాకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ మీద అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. గేల్ తన రికార్డ్ రాహుల్ బద్దలు కొడతాడని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఏమైనా క్రిస్ గేల్ నోట రాహుల్ పేరు రావడం కాస్త ఆశ్చర్యానికి గురి చేసినా.. రాహుల్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో ఖుషి అవుతున్నారు. మరి గేల్ రికార్డు కేఎల్ రాహుల్ బ్రేక్ చేస్తాడా? చెయ్యడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Chris Gayle picks KL Rahul as the player to break his record of 175 in IPL.#ChrisGayle #KLRahul #PL #IPL2023 #IndianPremierLeague #LSG #LucknowSuperGiants #Cricket #SBM pic.twitter.com/ROOl75W8tl
— SBM Cricket (@Sbettingmarkets) March 18, 2023