టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. కాదు.. కాదు.. టీ20 స్పెషలిస్ట్‌గా రూపాంతరం చెందిన టెస్టు బ్యాటర్ పుజారా గురించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది. ఐపీఎల్ 2023 కోసం పుజారాను తమ జట్టులోకి తీసుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అతనితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పుజారా ఇంగ్లండ్‌లో రాయల్ లండన్ వన్డే కప్‌లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఫోర్లు, సిక్సుల వర్షం కురిపిస్తూ.. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. పుజారా సారథ్యంలోని ససెక్స్ జట్టు ఇప్పటికే సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఒక వైపు జట్టును విజయవంతంగా నడుపుతూనే.. మరోవైపు తన పవర్ హిట్టింగ్‌తో సంచలనాలు నమోదు చేస్తున్నాడు.
టీమిండియాలో కేవలం టెస్టు జట్టుకే పరిమితమైన పుజారా.. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టు తర్వాత.. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అందులో అద్భుతంగా రాణించి, రాయల్ లండన్ వన్డే కప్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. ఈ పరిమిత ఓవర్ల టోర్నీలో పుజారా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. 75 బంతుల్లోనే సెంచరీ, 28 బంతుల్లో 74 పరుగులు చేసి ఒక కొత్త పుజారాను పరిచయం చేస్తున్నాడు. ఇలా తనపై ఉన్న టెస్టు ముద్రను చెరిపేసుకుంటున్నాడు. పుజారాలో వచ్చిన ఈ మార్పును నిశితంగా గమనిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ పుజారాను తమ జట్టులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.
ఐపీఎల్ 2022 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సరైన జట్టును ఎంపిక చేసుకోలేదనే విమర్శలు ఎదుర్కొంది. ఆ విమర్శలకు తగ్గట్లే జట్టు కూడా దారుణ ప్రదర్శనను కనబర్చింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ ఫెల్యూయిర్‌తో జట్టులో చేయాల్సిన మార్పులపై సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. మొదటి నుంచి తక్కువ ధరకు మంచి మంచి ఆటగాళ్లను తీసుకోవడం ఎస్‌ఆర్‌హెచ్ స్ట్రాటజీ. అంచనాలు లేని ఆటగాళ్లను వేలంలో దక్కించుకుని వారితోనే ఎస్‌ఆర్‌హెచ్ అద్భుతాలు చేస్తుంది. మొదటి నుంచి సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌ది ఇదే పంథా.
కానీ.. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఈ మ్యాజిక్ మిస్ అయినట్లు కనిపించింది. కొంత మంది ఆటగాళ్లపై ఎక్కువగా డబ్బులు కుమ్మరించి.. తర్వాత చేతులు కాల్చుకుంది. దీంతో మారోసారి అలాంటి తప్పు చేయకుండా.. ప్రస్తుతం ఉన్న జట్టులో కొన్ని మార్పులకు పూనుకుంది. అలాగే జట్టులో అంతా యువ రక్తమే ఉంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ తప్పా అంతా కుర్రాళ్లే. ఐపీఎల్ లాంటి వేదికలపై యువ క్రికెటర్ల హవా నడుస్తున్నప్పటికీ.. కొన్నిసార్లు సీనియర్ ప్లేయర్లే విజయావకాశాలను శాసిస్తున్నారు. చివరి వరకు ఉత్కంఠగా సాగే మ్యాచ్‌లో కుర్రాళ్లు చాలా వరకు ఒత్తిడికి గురై చేతులు ఎత్తేస్తుంటారు. కానీ.. సీనియర్ ప్లేయర్లు ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణిస్తారు.
ఈ సమస్యను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2022లో ఎదుర్కొంది. చాలా మ్యాచ్‌ల్లో ఆ జట్టు అనుభవం లేని ఆటగాళ్లతో ఇబ్బంది పడింది. ఈ విషయాన్ని గుర్తించిన సన్‌రైజర్స్ యాజమాన్యం.. జట్టులో ఒక సీనియర్ ప్లేయర్ అవసరం ఎంతైన ఉందని ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌లో అద్భుతంగా రాణిస్తున్న పుజారాపై వీరి కన్ను పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పుజారా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని టెస్టు ప్లేయర్ అనేంత సాహసం ఎవరూ చేయడం లేదు. అందుకే పుజారాను తీసుకునేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ప్రయత్నిస్తుంది. పైగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఇండియన్ స్టార్ ప్లేయర్ లేడనే అపవాదు కూడా ఉంది. మిగతా జట్లకు ఫ్రెంట్‌ఫేస్‌గా ఒక టీమిండియా స్టార్ ఉన్నాడు. సీఎస్‌కేకు ధోని, ఆర్సీబీకి కోహ్లీ, ముంబైకి రోహిత్ శర్మ, గుజరాత్‌కు పాండ్యా, లక్నోకు రాహుల్, ఢిల్లీకి పంత్, రాజస్థాన్‌కు శాంసన్, కోల్‌కత్తాకు శ్రేయస్ అయ్యర్ ఇలా అన్ని జట్లులో టీమిండియా స్టార్ ప్లేయర్లు ఉన్నారు.
కానీ ఎస్‌ఆర్‌హెచ్‌లో అలాంటి ఆటగాడు లేడు. దీంతో ఈ జట్టులో ఏదో వెలితి ఉన్నట్లు కనిపిస్తుంటుంది. పుజారా రాకతో జట్టులో ఒక సీనియర్ ప్లేయర్‌తో పాటు, టీమిండియా స్టార్ ప్లేయర్ లోటు కూడా తీరుతుందని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావిస్తుంది. అలాగే తరచు గాయాలతో కేన్ విలియమ్సన్ సతమతమవుతుండడం కూడా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఇబ్బందిగా మారింది. దీంతో కేన్ మామ అందుబాటులో లేకుంటే పుజారాకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించవచ్చని సన్‌రైజర్స్ యాజమాన్యం భావిస్తుంది. ప్రస్తుతం పుజారా ఇంగ్లండ్‌లో ససెక్స్ జట్టును విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఈ విషయాలన్ని దృష్టిలో ఉంచుకుని.. పుజారాను జట్టులోకి తీసుకొచ్చేందుకు సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ బలంగా ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి అన్ని కుదిరితే.. ఐపీఎల్ 2023లో పుజారా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగే అవకాశం పుష్కలంగా ఉంది. కాగా.. 2021లో పుజారా చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. మరి పుజారా.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ద్రవిడ్ నుంచి సెహ్వాగ్ స్టైల్‌కు మారుతున్న పుజారా! టార్గెట్ అదేనా..?
Cheteshwar Pujara in the Royal One Day Cup, where he is playing for Sussex:
9, 63, 14*, 107, 174, 49*, 66, 132. pic.twitter.com/kQL8aZ7DCQ
— Wisden India (@WisdenIndia) August 23, 2022
Cheteshwar Pujara smashed 22 runs in an over – 4,2,4,2,6,4.
pic.twitter.com/HhgGlw7c0z— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2022
Cheteshwar Pujara is in some form 😳 – https://t.co/cGhXqNWMVX pic.twitter.com/z7ZdumXLm0
— Cricbuzz (@cricbuzz) August 23, 2022