టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్‌గా పేరున్న పుజారా ఒక్కసారిగా తన బ్యాటింగ్ స్టైల్‌ను మార్చేశాడు. సాంప్రదాయ క్రికెట్ షాట్లతో అలరించే పుజారా.. టీ20కి మించిన స్టైల్లో దంచికొట్టాడు. ఇంతవరకు ఆడని స్వీప్ షాట్లు కొట్టి వామ్మో.. పుజారా అంటే ఫ్లవర్ కాదు.. ఫైరు అనే రేంజ్‌లో రెచ్చిపోయాడు. బౌలర్లపై శివాలెత్తి ఒకే ఓవర్‌లో 4, 2, 4, 2, 6, 4 బాది 22 పరుగులు పిండుకున్నాడు. పుజారాను కెరీర్‌ను ఆరంభం నుంచి చూస్తున్న వారు ఈ ఇన్నింగ్స్‌ను పుజారా ఆడాడంటే నమ్మడం కొంచెం కష్టమే అయినా.. ఇది నిజం.
శుక్రవారం రాయల్ లండన్ వన్డే కప్ 2022లో భాగంగా వార్‌విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా తన విశ్వరూపం చూపించాడు. పవర్ హిట్టింగ్‌తో ఒకే ఓవర్‌లో 22 పరుగులు బాదడంతో పాటు 79 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని సంచలనం సృష్టించాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. రాయల్ లండన్ వన్డే కప్ 2022లో భాగంగా శుక్రవారం ససెక్స్-వార్‌విక్‌షైర్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వార్‌విక్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ రొబర్ట్ 111 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సులతో 114 పరుగులు చేసి సెంచరీ సాధించాడు.
311 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన ససెక్స్‌ను పుజారా ఒంటి చేత్తో ముందుకు నడిపించాడు. అతనికి ఓపెనర్ అలీస్టైర్ ఓర్(81) తోడు నిలవడంతో పుజారా రెచ్చిపోయాడు. ముఖ్యంగా లైమ్ నార్వెల్ వేసిన ఇన్నింగ్స్ 45వ ఓవర్‌లో పుజారా రెచ్చిపోయాడు. గ్రౌండ్‌కు అన్ని వైపులా 360 డిగ్రీ యాంగిల్స్‌లో షాట్లు ఆడుతూ.. బౌలర్‌కు చుక్కలు చూపించాడు. ఈ ఒక్క ఓవర్‌లోనే ఏకంగా మూడు ఫోర్లు, ఒక సిక్స్, రెండు టూడీస్‌తో ఏకంగా 22 పరుగులు బాది ఔరా అనిపించాడు.
పుజారాలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించేలా పుజారా బ్యాటింగ్ సాగింది. ఇదే ఊపులో ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో పుజారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పుజారా దెబ్బకు మ్యాచ్ ససెక్స్ చేతుల్లోకి వచ్చేసింది. కానీ.. ఇన్నింగ్స్ 49వ ఓవర్ తొలి బంతికి హన్నన్ బౌలింగ్ పుజారా అవుట్ అయ్యాడు. 79 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 107 పరుగులు చేసిన పుజారా పెవిలియన్ చేరడంతో తర్వాతి బ్యాటర్లు చేతులెత్తేయడంతో ససెక్స్ ఈ మ్యాచ్‌ను చేజార్చుకుంది. పుజారా కష్టానికి ఫలితం లేకుండా పోయింది.
నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి కేవలం 4 పరుగుల తేడాతో ఓడింది. కాగా.. ససెక్స్ జట్టుకు పుజారానే కెప్టెన్. ఐపీఎల్‌లో పుజారాకు ఇప్పటి వరకు సరైన అవకాశాలు రాలేదు. మరి ఈ ఇన్నింగ్స్‌తో పుజారా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. కాగా.. ఇదే మ్యాచ్‌లో వార్‌విక్‌షైర్ తరపున ఆడిన కృనాల్ పాండ్యా డకౌట్ అయ్యాడు. మరి ఈ మ్యాచ్‌లో పుజారా పవర్ హిట్టింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
4 2 4 2 6 4
TWENTY-TWO off the 47th over from @cheteshwar1. 🔥 pic.twitter.com/jbBOKpgiTI
— Sussex Cricket (@SussexCCC) August 12, 2022
4️⃣2️⃣4️⃣2️⃣6️⃣4️⃣
Here’s something you don’t see too often – Cheteshwar Pujara smashing 22 runs in an over
He hit a 73-ball ton for Sussex against Warwickshirepic.twitter.com/fdF2QTkPAl
— ESPNcricinfo (@ESPNcricinfo) August 12, 2022
ఇది కూడా చదవండి: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు భారత జట్టు రెడీ! వరల్డ్ టీమ్‌తో మ్యాచ్ ఎప్పుడంటే..?