టీమిండియా వెటరన్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా టెస్టు స్పెషలిస్ట్ అని తనపై ఉన్న ముద్రను చెరిపేసేలా ఉన్నాడు. ప్రస్తుతం అతని బ్యాటింగ్ స్పీడ్ చూస్తే టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ కింద లెక్కెయాల్సి వస్తుందేమో. ఇంగ్లండ్ కౌంటీల్లో సెంచరీలతో చెలరేగిన పుజారా.. తాజాగా రాయల్ లండన్ వన్డే కప్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. మొన్నటి మొన్న సర్రేతో జరిగిన మ్యాచ్‌లో 131 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సులతో 174 పరుగులు చేసి ఔరా అనిపించిన పుజారా.. మంగళవారం మిడిల్‌సెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 90 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సులతో 132 పరుగులు చేసి తగ్గేదేలే అంటున్నాడు. కాగా.. పుజారా 75 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకోవడం విశేషం. వార్‌విక్‌షైర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా పుజారా 73 బంతుల్లోనే సెంచరీతో చేలరేగిన విషయం తెలిసిందే. ఇక రాయల్ లండన్ వన్డే కప్-2022లో 500 పరుగుల మార్క్‌ను ధాటిన రెండో బ్యాటర్‌గా పుజారా నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పుజారా కెప్టెన్సీలోని ససెక్స్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 400 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ అల్సోప్ 155 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సులతో 189 పరుగులు, కెప్టెన్ పుజారా 90 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సులతో 132 పరుగులు చేసి చెలరేగడంతో ససెక్స్ భారీ స్కోర్ సాధించింది. లక్ష్యఛేదనకు దిగిన మిడిల్‌సెక్స్ టీమ్ 38.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ససెక్స్ టీమ్ 157 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ససెక్స్ టీమ్ రాయల్ లండన్ వన్డే కప్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.
ఇది కూడా చదవండి: జింబాబ్వే బ్యాటర్ సికందర్ రజాను రౌండప్ చేసిన భారత ఆటగాళ్లు!
Brilliant team performance from the boys today and we get an important win! 🙌
Onto the semis @SussexCCC 💪 pic.twitter.com/NX24rFMNR2
— cheteshwar pujara (@cheteshwar1) August 23, 2022
Walking into the semi-final like… 😏 pic.twitter.com/5SvkkfFDsZ
— Sussex Cricket (@SussexCCC) August 23, 2022
A century from just 75 balls for @cheteshwar1. 🤩 💯
Just phemeomenal. 💫 pic.twitter.com/z6vrKyqDfp
— Sussex Cricket (@SussexCCC) August 23, 2022