టీమిండియా సీనియర్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్‌పై ప్రశంసలు కురిపించాడు. అతను టాలెంటెడ్ క్రికెటర్ అంటూ కితాబిచ్చాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆదివారం జరగబోయే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. ఆసియా కప్‌లో భాగంగా 28న భారత్-పాక్ తలపడనున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌పై ప్రిడిక్షన్లు, బలాబలాలపై సోషల్ మీడియాలోగా తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో భారత క్రికెటర్ పుజారా, పాక్ క్రికెటర్ రిజ్వాన్‌పై ప్రశంసలు కురిపించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
గురువారం ట్విట్టర్‌లో 30 నిమిషాల పాటు అభిమానులతో ముచ్చటించిన పుజారా వారు అడిగి ప్రశ్నలకు జవాబిచ్చాడు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అభిమాని రిజ్వాన్ గురించి అడగ్గా.. ‘అతనితో కలిసి ఆడటాన్ని ఎంజాయ్ చేశాను. మంచి వ్యక్తి.. అలాగే టాలెంటెడ్ క్రికెటర్’ అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా.. పుజారా, రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో ససెక్స్ జట్టుకు కలిసి ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుజారా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు. అక్కడ రాయల్ లండన్ వన్డే కప్‌లో అదరగొడుతున్నాడు. తన బ్యాటింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకుని ఎటాకింగ్ క్రికెట్ ఆడుతూ.. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. మరి రిజ్వాన్‌ను పుజారా మెచ్చుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ద్రవిడ్ నుంచి సెహ్వాగ్ స్టైల్‌కు మారుతున్న పుజారా! టార్గెట్ అదేనా..?
I enjoyed my time with him, he is a very nice guy and a talented cricketer https://t.co/LloU2tG0KT
— Cheteshwar Pujara (@cheteshwar1) August 24, 2022
Cheteshwar Pujara 🤝 Mohammad Rizwan
The two batters put together a 154-run partnership for Sussex earlier today 👏 #CountyChampionship pic.twitter.com/3Fe9AeDEYM
— ESPNcricinfo (@ESPNcricinfo) April 30, 2022
Pujara and Rizwan added 154 runs for Sussex in the county championship.pic.twitter.com/1Ke2bWjBNb
— Johns. (@CricCrazyJohns) May 1, 2022
Rizwan is a fan of Pujara’s concentration. He talks about playing with him in county cricket. pic.twitter.com/8gfeaccDdR
— Mazher Arshad (@MazherArshad) May 11, 2022