టీమిండియా స్టార్ క్రికెటర్ పుజారాకు కెప్టెన్ రోహిత్ శర్మ అండ్ కో నుంచి అరుదైన గౌరవం లభించింది. తన కెరీర్‌లో ఒక అరుదైన మైలురాయిని అందుకున్న క్రమంలో పుజారాను టీమిండియా స్పెషల్ గిఫ్ట్‌తో గౌరవించింది.
టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాకు కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన గౌరవం అందించాడు. భారత టెస్టు జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న పుజరా చాలా ఏళ్ల నుంచి టీమిండియాకు సేవలు అందిస్తున్నాడు. తన డిఫెన్సివ్ ఆటతో ది గ్రేట్ రాహుల్ ద్రవిడ్ వారసుడిగా, నయా వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో భారత ఇన్నింగ్స్‌కు అడ్డుగోడలా నిలబడిపోయాడు. ఇలా చాలా ఏళ్ల నుంచి టీమిండియాను టెస్టుల్లో అగ్రశ్రేణి జట్టుగా నిలబెడుతున్న పుజారా.. తన కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు.. పుజారాకు వందో టెస్టు. ఈ అరుదైన మైలురాయిని పుజారా అందుకుంటున్న క్రమంలో.. టీమిండియా పుజారాకు స్పెషల్ గిఫ్ట్‌ను అందించింది. పుజారా మైదానంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో తోటి ఆటగాళ్లంతా ఇరువైపులా నిలబడి గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించారు. పుజారా లాంటి సీనియర్ ప్లేయర్‌ను ఈ విధంగా గౌరవించడంపై కెప్టెన్ రోహిత్ శర్మపై క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కోహ్లీ 100వ టెస్టు విషయంలోనూ రోహిత్ ఇలానే గార్డ్ ఆఫ్ హానర్‌తో గౌరవించాడు.
ఇక పుజారా తన కెరీర్‌లో ఇప్పటి వరకు 99 టెస్టులు పూర్తి చేసుకుని.. 100వ టెస్టు కోసం గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. 99 టెస్టుల్లో 44.15 సగటుతోతో 7,021 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 5 వన్డేలు కూడా ఆడిన పుజారా.. 51 పరుగులు మాత్రమే చేశాడు. 242 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి.. 51.89 సగటుతో 18525 పరుగుల చేశాడు. అందులో 56 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పుజారా నిఖార్సయిన టెస్టు క్రికెటర్. అలాంటి ప్లేయర్ టీమిండియాకు దొరకడం దేశం చేసుకున్న అదృష్టం. మరి పుజారా వందో టెస్టు ఆడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A guard of honour for Cheteshwar Pujara. pic.twitter.com/oDPD8fbLXU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 17, 2023
Beautiful moments for Pujara to remember for the rest of his life. pic.twitter.com/vGMs6xdepC
— Johns. (@CricCrazyJohns) February 17, 2023