టీమిండియా టెస్ట్ స్ఫెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా సంచలన విషయం వెల్లడించాడు. ఒక కొత్త జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించాడు. పూర్తి వివరాలు.. ఈ నెల 10న సోమవారం వెల్లడించనున్నట్లు తెలిపాడు. బ్లూ కలర్ జెర్సీతో ఉన్న ఫొటోను తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో షేర్ చేస్తూ.. పుజారా సర్‌ప్రైజ్ ఇచ్చాడు. పైగా.. తన కొత్త టీమ్ పేరును కనుక్కొమని ఫ్యాన్స్‌కు ఒక పజిల్ కూడా ఇచ్చాడు. కాగా.. పుజారా ఏ టీమ్‌కు ఆడబోతున్నాడో అనే ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో మొదలైంది. గతంలో కేవలం టెస్టు క్రికెట్‌కే బ్రాండ్‌అంబాసిడర్‌లా ఉన్న పుజారా.. కౌంటీ క్రికెట్ తర్వాత సరికొత్త బ్యాటర్లా మారిపోయాడు.
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన రీషెడ్యూల్ టెస్టు తర్వాత.. కౌంటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టన పుజారా దుమ్ముదుమారాం చేశాడు. వరుస సెంచరీలు, డబుల్ సెంచరీలతో అదరగొట్టాడు. ఆ తర్వాత.. రాయల్ లండన్ కప్ 2022లో ససెక్స్ జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన పుజారా.. టీ20 క్రికెట్‌ను మించిన వేగంతో ఆడాడు. ఆడుతుంది పుజారానేనా అనే అనుమానం కలిగేలా తన సహజ శైలికి భిన్నంగా భారీ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. వరుస హాఫ్ సెంచరీలతో రాయల్ లండన్ కప్‌లో సంచలనాలు నమోదు చేశాడు. దీంతో పుజారాను కేవలం టెస్టు ప్లేయర్‌గానే చూడకుండా.. అతనికి వన్డేల్లో సైతం అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా వినిపించింది.
ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్న పుజారా.. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఆడబోయే టెస్టు సిరీస్‌లతో మళ్లీ నేషనల్ డ్యూటీస్‌కు వెళ్లనున్నాడు. మరి ఈ క్రమంలోనే కొత్త టీమ్‌కు సైన్ చేశాను.. 10న పూర్తి వివరాలు వెల్లడిస్తానని అందరిని సస్పెన్స్‌లో పెట్టాడు. మరీ.. పుజారా ఏ జట్టుకు, ఏ లీగ్‌లో ఆడునున్నాడో తెలుసుకోవాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. ఇక ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్ట్ కంటే ముందు పూర్ ఫామ్‌తో జట్టులో స్థానంలో కోల్పోయిన పుజారా.. రీ షెడ్యూల్డ్ టెస్టులోనూ పెద్దగా రాణించలేదు. ఒక హాఫ్ సెంచరీ చేసినా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత పుజారా కౌంటీల్లో అదరగొట్టి.. తన పూర్వ ఫామ్‌ను అందుకున్నాడు.
It feels great to start this new innings!
Can you guess my new team’s name?
Stay tuned for more updates! #NewTeam #Cricket #Surprise pic.twitter.com/2fUPZbTXql
— Cheteshwar Pujara (@cheteshwar1) October 7, 2022