ప్రస్తుతం భారత ప్లేయర్లు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. ఈ మెగా లీగ్ తర్వాత ఇంగ్లాండ్ వేదికగా ఆస్టేలియా ప్రత్యర్థిగా భారత్ డబ్ల్యూటీసి ఫైనల్ జరగబోతుంది. ఓ వైపు అందరూ ఐపీఎల్ ఆడుతుంటే పుజారా మాత్రం ఇంగ్లాడ్ కౌంటీల్లో సత్తా చాటుతూ బోలెడంత ఆత్మవిస్వాసాన్ని నింపుకుంటున్నాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఐపీఎల్ హడావుడే కనిపిస్తుంది. ఇప్పుడు టెస్టులు చూసే ఆసక్తి కూడా ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలో టెస్ట్ స్పెషలిస్ట్, భారత టాప్ ఆర్డర్ బ్యాటర్ పుజారా సెంచరీ కొట్టాడంటే అందులో పెద్దగా విషయం లేదని భావిస్తారందరు. కానీ ఒక నెల తర్వాత ఇంగ్లాండ్ వేదికగా ఆస్టేలియా ప్రత్యర్థిగా భారత్ డబ్ల్యూటీసి ఫైనల్ జరగబోతుంది. దీంతో ఈ మ్యాచ్ కోసం సిద్ధమవ్వడం చాలా ముఖ్యం. ఓ వైపు అందరూ ఐపీఎల్ ఆడుతుంటే పుజారా మాత్రం ఇంగ్లాడ్ కౌంటీల్లో సత్తా చాటుతూ బోలెడంత ఆత్మవిస్వాసాన్ని నింపుకుంటున్నాడు. దీంతో ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా భారత్ కి కీలకం కానున్నాడు.
ప్రస్తుతం పుజారా ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. బాగా ఆడుతున్నందుకు ఇటీవలే సస్సెక్స్ జట్టుకి ఈ నయా వాల్ ని కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ పిచ్ ల మీద మంచి రికార్డ్ ఉన్న పుజారా వరుసపెట్టి సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే డార్హంతో జరిగిన మ్యాచులో సెంచరీ చేసిన పుజారా.. తాజాగా గ్లోష్టర్ షైర్ తో భారీ శతకం కొట్టి ఆస్ట్రేలియాకి వార్నింగ్ సంకేతాలు పంపాడు. 191 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ టెస్ట్ స్పెషలిస్ట్ మొత్తం 238 బంతుల్లో 20 ఫోర్లు 2 సిక్సర్లతో 151 పరుగులు చేసాడు. గత కౌంటీ సీజన్లో కూడా పుజారా 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 58 సెంచరీలు సాధించి వసీం జాఫర్ ని వెనక్కి నెట్టి భారత్ తరపున నాలుగో స్థానంలో నిలిచాడు. ఓవరాల్ గా భారత్ తరపున 81 సెంచరీలతో సచిన్, సునీల్ గవాస్కర్ అగ్రస్థానంలో నిలిచారు. ద్రావిడ్ 68 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. మరొక నెల రోజుల్లో డబ్ల్యూటీసి ఫైనల్ ఉన్న నేపథ్యంలో పుజారా ఇలా వరుసపెట్టి సెంచరీలు కొట్టడం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Hundred by Cheteshwar Pujara – yet another captain’s innings by Pujara. He’s unstoppable in the County Championship!
The preparations for the WTC Final are going superbly. pic.twitter.com/x3iiUphDqW
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 29, 2023