బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ చతేశ్వర్ పుజారా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డు ఏంటంటే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య బుధవారం ఇండోర్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. తొలి ఇన్నింగ్స్ లో కనీసం పోరాటం చేయకుండానే కేవలం 109 పరుగులకే చాప చుట్టేసింది. ఏ బ్యాట్స్ మెన్ కూడా కనీసం 30 పరుగుల మార్క్ అందుకోకపోవడం విచారకరం. భారత్ జట్టులో కోహ్లీ చేసిన 22 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్ బ్యాట్సమెన్ చతేశ్వర్ పుజారా చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నాడు.
ఈ క్రమంలోనే స్వదేశంలో 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ నిరాశపరిస్తే.. టీమిండియా నయావాల్ పుజారా కేవలం ఒక్క పరుగు చేసి స్పిన్నర్ నాథన్ లియోన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. దీంతో పుజారా ఒక చెత్త రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ చతేశ్వర్ పుజారా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన వైఫల్యాన్ని కొనసాగిస్తున్నాడు. విదేశాల్లో తన ప్రదర్శన ఎలాగున్నా.. స్వదేశంలో మాత్రం ఈ నయావాల్ ఎప్పుడూ మంచి ప్రదర్శనే చేస్తాడు.
అయితే గత కొంత కాలంగా పుజారా ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. చాలా సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ మీద సెంచరీ చేసి మంచి టచ్ లో కనిపించిన పుజారా.. మరోసారి తన బ్యాటింగ్ వీక్నెస్ ని బయటపెట్టాడు. స్పిన్నర్ల బౌలింగ్ లో ఆడలేక చేతులెత్తేస్తున్నాడు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో స్పిన్నర్ లియోన్ బౌలింగ్ లో ఔటై టెస్టుల్లో ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. పుజారా ఇప్పటివరకు 12 సార్లు ఈ ఆసీస్ స్పిన్నర్ కి వికెట్ సమర్పించుకున్నాడు. అంతేకాదు ఇదివరకే అండర్సన్ కూడా పుజారాను 12 సార్లు అవుట్ చేసాడు. తాజాగా లియోన్ ఈ రికార్డు ని సమం చేసాడు. దీంతో సునీల్ గవాస్కర్ తర్వాత ఒక బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔటైన బ్యాట్స్ మెన్ గా పుజారా నిలిచి చెత్త రికార్డ్ ని తన పేరిట మూటగట్టుకున్నాడు.