కొన్ని సార్లు చోటు మారితే ఫేటు మారుతుందనే మాట వినిపిస్తుంటుంది. ఈ మాట టీమిండియా వెటరన్ క్రికెటర్లయిన చటేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుందేమో. భారత క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ ఆటగాళ్లు కెరీర్ చివరి దశలో కొంత తడబాటు ఎదుర్కొన్నారు. టీమిండియా తరపున ఆశించిన స్థాయిలో రాణించలేక నిరాశపరిచారు. ఈ క్రమంలోనే ఒక విధంగా చెప్పాలంటే జట్టుకు భారంగా మారారు. జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్డ్ మ్యాచ్‌లో పుజారా ఆశించినంతగా రాణించలేదు.
అలాగే ఉమేశ్ యాదవ్ కూడా ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయాడు. జట్టులో చోటు పోయినా.. ఆశించిన స్థాయిలో రాణించకపోతున్నాం అంటూ బాధపడుతూ కూర్చోకుండా.. తమ ఆటతోనే తమను తాము నిరూపించుకోవాలని ఇంగ్లండ్ వెళ్లారు. అక్కడి కౌంటీ క్రికెట్‌లో తొలిసారి ఆడుతూ అదరగొడుతున్నారు. ఫామ్ కోల్పోయి టీమిండియాకు భారంగా మారిన ఆటగాళ్లు వీళ్లేనా అని ఆశ్చర్యపోయేలా ఆడుతున్నారు.
పుజారా అయితే తన సహజ శైలికి భిన్నంగా పవర్‌హిట్టింగ్‌తో ఇంగ్లీష్ బౌలర్లను చెడుగుడు ఆడుతున్నాడు. కౌంటీల్లో ఆడిన ఈ తక్కువ కాలంలోనే పుజారా ఏకంగా 7 సెంచరీలు చేశాడు. రాయల్ లండన్ వన్డే కప్ 2022లో ససెక్స్ జట్టుకు ఆడుతున్న పుజారా రెండో వరుస మ్యాచ్‌ల్లో (102,174) రెండు సెంచరీలు చేశాడు. అవి కూడా 130కి పైగా స్ట్రైక్‌రేట్‌తో బాదాడు. రాయల్ లండన్ వన్డే కప్‌లో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన పుజారా 367 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక ఈ టోర్నీలో మిడిల్‌సెక్స్ జట్టు తరఫున ఆడుతున్న ఉమేష్ యాదవ్ ఐదు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇలా ఈ ఇద్దరు ఆటగాళ్లు సైతం ఇంగ్లండ్‌లో అదరగొడుతూ.. భారత సెలెక్టర్లకు సవాలు విసురుతున్నారు. మరి ఈ పుజారా, ఉమేష్ యాదవ్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sussex captain Cheteshwar Pujara gets his career-best List A score!
Updates ▶ https://t.co/NAGl6Hrj80 pic.twitter.com/UpMY72dBds
— ESPNcricinfo (@ESPNcricinfo) August 14, 2022
Matches – 5
Wickets – 15
Average – 17.13
Economy – 5.5Umesh Yadav has been impressive with the ball for Middlesex in the Royal London ODI Cup 🔥👏#UmeshYadav #India #Middlesex #Cricket #RLOC pic.twitter.com/47bNuusXSy
— Wisden India (@WisdenIndia) August 15, 2022