టీమిండియా టాప్ సీక్రెట్స్ అన్ని బట్టబయలైపోయాయి. స్టింగ్ ఆపరేషన్ లో చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అడ్డంగా దొరికిపోయాడు. కోహ్లీ-గంగూలీ మధ్య ఏం జరుగుతుందనే మొత్తం చెప్పేశాడు. ఇంకా బోలెడు విషయాలు బయటపెట్టేశాడు.
టీమిండియాపై స్టింగ్ ఆపరేషన్.. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ అడ్డంగా దొరికిపోయాడు. సంచలన నిజాలు బయటపెట్టాడు. అవును మీరు విన్నది కరెక్టే. సోషల్ మీడియా అంతా కూడా ఒకటే మోత మోగిపోతోంది. టీమిండియాని బయట నుంచి చూస్తే అద్భుతమైన క్రికెటర్లు, అంతకు మించి అన్నట్లు ఉండే విజయాలు ఫ్యాన్స్ ని ఎప్పటికప్పుడు ఎంటర్ టైన్ చేస్తూనే ఉంటాయి. అయితే అంతా బాగున్నట్లు బయటకు కనిపిస్తుంది. కానీ లోపల లోపల చాలానే జరుగుతున్నాయి. అప్పట్లో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు అందరూ అవాక్కయ్యారు. కోహ్లీ-గంగూలీకి అస్సలు పడట్లేదు అంటే చాలామంది నమ్మినప్పటికీ.. కొందరు మాత్రం కొట్టిపారేశారు. ఇప్పుడు ఆ సీక్రెట్స్ అన్ని మొత్తం బయటపడ్డాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత జట్టులో అసలేం జరుగుతుందనే విషయాల్ని చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ బయటపెట్టాడు. ఓ ప్రముఖ మీడియా ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు చేతన్ శర్మ మాటలు.. క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కడికీ.. భారత జట్టుపై విరక్తి కలిగేలా చేస్తున్నాయి. గంగూలీ-కోహ్లీ వివాదం విషయానికే వస్తే.. ‘గంగూలీ వల్ల కోహ్లీ తన కెప్టెన్సీ కోల్పోయానని అనుకుంటున్నాడు. కానీ ఆ రోజు సెలెక్షన్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ లో 9 మంది వరకు ఉన్నాం. కోహ్లీ కెప్టెన్సీ వదిలేయడంపై ‘మరోసారి ఆలోచించు’ అని చెప్పాడు. బహుశా కోహ్లీ ఆ మాటలు వినలేదేమో? ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కోహ్లీ ఇన్ డైరెక్ట్ గా గంగూలీని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. తనకు చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తప్పించారని ఆరోపణలు చేశాడు. దీంతో కోహ్లీ అబద్ధం చెబుతున్నాడని గంగూలీ చెప్పాడు. కోహ్లీ అబద్ధం చెప్తాడని అందరూ అనుకున్నారు. అక్కడ మొదలైంది బోర్డ్ వర్సెస్ ప్లేయర్ల గొడవ’ అని చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు.
‘ఇప్పుడు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు గంగూలీ సపోర్ట్ ఏం కాదు. కానీ కోహ్లీ అంటే మాత్రం అతనికి నచ్చదు. రోహిత్ ఇకపై టీ20 జట్టులో ఎక్కువ కాలం కొనసాగడు. అతడితో పాటు కోహ్లీ కూడా కష్టమే. అందుకే హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ ఇచ్చి.. శుభమన్ గిల్ కు అవకాశాలిస్తాం’ అని చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు. భారత క్రికెటర్ల ఫిట్ నెస్ గురించి.. ‘టీమిండియాలోని ఆటగాళ్లు ఒకవేళ పూర్తిస్థాయిలో ఫిట్ గా లేకపోతే.. మ్యాచ్ కి ముందు ఇంజెక్షన్ తీసుకుని కనీసం 80 శాతం ఫిట్ గా ఉండేలా చూసుకుంటున్నారు. బుమ్రా కనీసం వంగలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ప్రైవేట్ గా ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్ నెస్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అవి పెయిన్ కిల్లర్స్ కాదు, ఒకవేళ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే డోపింగ్ టెస్టులో దొరికిపోతారు’ అని చేతన్ శర్మ చెప్పుకొచ్చాడు. మరి వింటుంటూనే షాకింగ్ ఉన్న ఈ విషయాలు.. ఎలాంటి సంచలనాలకు కారణమవుతాయో చూడాలి. మరి దీనిపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.
We Stand With Chetan Sharma pic.twitter.com/Og0SE9QcpZ
— ً (@Ro45Goat) February 14, 2023