ప్రముఖ న్యూస్ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసి.. తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. భారత క్రికెటర్లు ఇంజెక్షన్లు తీసుకుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారం రేపుతున్నాయి.
టీమిండియా చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రముఖ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో పలు విషయాల్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ మాజీ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుతం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యాను కూడా ఈ వ్యాఖ్యల్లో ప్రస్తావించి వారి గురించి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య ఇగో వార్ నడిచిందని, తనను వన్డే కెప్టెన్సీ నుంచి గంగూలీ ఉద్దేశపూర్వకంగా తప్పించాడని భావించిన కోహ్లీ.. మీడియా ముందు దాదాను దోషిగా నిలిపేందుకు టీ20 కెప్టెన్ కోనసాగమని తనను ఎవరూ అడగలేదని కోహ్లీ అబద్ధం చెప్పాడంటూ చేతన్ శర్మ వెల్లడించాడు. రోహిత్ శర్మ మీద ప్రేమతో అతన్ని టీమిండియా కెప్టెన్‌గా చేయలేదని కేవలం విరాట్ కోహ్లీ మీద కోపంతోనే రోహిత్‌కు కెప్టెన్సీ అందించిందని అన్నాడు.
అలాగే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఇంటికి వచ్చి.. ఇక్కడే సోఫాలో పడుకుని, టీమ్‌లో ప్లేస్ గురించి మాట్లాడే వాడని అన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో రెండో వర్గాలు ఉన్నాయని, ఒకటి రోహిత్ శర్మది మరొకటి కోహ్లీదని చేతన్ పేర్కొన్నాడు. వారిద్దరి మధ్య ఇగోతో కోల్డ్ వార్ నడుస్తుందని, బయటికి మాత్రం ఇద్దరూ చాలా మంచి సంబంధాలు ఉన్నట్లు ఉంటారని అన్నాడు. అలాగే.. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలనే ఆలోచన కేవలం గంగూలీ ఒక్కడిదే కాదని, అది బోర్డులు పెద్దలంతా కలిసి తీసుకున్న ఉమ్మడి నిర్ణయమని అన్నాడు. పరిమిత ఓవర్లకు ఒకే కెప్టెన్ ఉండాలనే విషయం గురించి విరాట్ కోహ్లీకి ముందే చెప్పినట్లు.. అయిన కూడా అతను వినకుండా టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేయడంతో తప్పక వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాల్సి వచ్చిందని, దాంతో విరాట్ కోహ్లీ అహం దెబ్బతిన్నదని, అయితే దాదా వల్లే తన కెప్టెన్సీ పోయిందని కోహ్లీ బలంగా నమ్ముతాడని, అందుకే మీడియా ముందు అలా అబద్ధం చెప్పి ఉంటాడని చేతన్ పేర్కొన్నాడు.
అలాగే టీమిండియా క్రికెటర్లు పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోయినా.. ఇంజెక్షన్లు తీసుకుని మరీ మ్యాచ్‌లు ఆడుతుంటారని, 80 శాతం ఫిట్‌గా ఉంటే.. ఇంజెక్షన్లు తీసుకుని 100 శాతం ఫిట్‌గా ఉన్నట్లు బరిలోకి దిగుతారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోయినా అతనికి ఇంజెక్షన్లు ఇచ్చి మ్యాచ్ ఆడించారని, అతను ఇప్పటికీ పూర్తిగా ఫిట్‌గా లేడని చేతన్ వెల్లడించాడు. అయితే.. ఈ ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల డోపింగ్ టెస్టులోనూ దొరకరని, ఆ టెస్టులో దొరక్కకుండా ఊహించని ఎనర్జీని ఆ ఇంజెక్షన్ల ద్వారా వస్తుందని అన్నాడు. చాలా మంది ఇలానే ఇంజెక్షన్లు తీసుకుని ఫిట్ నెస్ లేకపోయినా.. మ్యాచ్‌లు ఆడుతున్నారని అన్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ లాంటి యువ క్రికెటర్‌కు ఛాన్స్ ఇచ్చేందుకు సీనియర్లను పక్కన పెట్టామని, ఇకపై రోహిత్ టీ20 కెరీర్ ముగిసినట్లేనని చేతన్ పేర్కొన్నాడు. పాండ్యానే టీ20లకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఉండని వెల్లడించాడు. అయితే.. చేతన్ శర్మ వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. బీసీసీఐ కూడా చేతన్ వ్యాఖ్యలపై దృష్టి సారించినట్లు సమాచారం. దీనిపై విచారణ జరిపి చేతన్ శర్మపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలొ తెలియజేయండి.
Chetan sharma – Saurav ganguly didn’t like virat kohli. We weren’t favouring Rohit, we were just against Kohli
Shameful they shouldn’t have treated their best batsman like thispic.twitter.com/cdHmhhsH2r
— leishaa ✨ (@katyxkohli17) February 14, 2023
We Stand With Chetan Sharma pic.twitter.com/Og0SE9QcpZ
— ً (@Ro45Goat) February 14, 2023