బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో చెన్నై తమ పాత ప్లేయర్లనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే తన పాత ప్లేయర్లు ఊతప్ప, బ్రావో, అంబటి రాయుడిని వేలంలో మరోసారి దక్కించుకున్న చెన్నై.. అలాగే ఆల్‌రౌండర్ దీపక్ చాహర్‌ను భారీ ధరకు దక్కించుకుంది. ఏకంగా రూ.14 కోట్లు చెల్లించి దీపక్‌ను సొంతం చేసుకంది. కాగా దీపక్ దక్కిన మొత్తం ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని కంటే ఎక్కువ. ధోనిని సీఎస్‌కే రూ.12 కోట్లకు రిటైన్ చేసుకుంది. మరి దీపక్ చాహర్‌కు రూ.14 కోట్లు చెల్లించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 Second-highest winning bid in Bengaluru today for Deepak Chahar! He remains with Chennai Super Kings 💛
Fetches INR 14 CRORE 🔥#IPLAuction #CricketTwitter pic.twitter.com/QqXqZriCvZ
— Cricbuzz (@cricbuzz) February 12, 2022