ఐపీఎల్ 2022కు రంగం సిద్ధమైంది. ఇంకా కొన్ని రోజుల్లోనే పొట్టి క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈసారి రెండు కొత్త ఫ్రాంచైజీలు రావడమే కాదు.. నిబంధనల్లోనూ కొన్ని మార్పులు చేశారు. ఈసారి ఐపీఎల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపనుందనే చెప్పాలి. మార్చి 26 నుంచి సీజన్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే అన్ని జట్లు స్పెషల్ క్యాంప్లు పెట్టి ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. చైన్నై సూపర్ కింగ్స్ కూడా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతోంది. అయితే ఆ టీమ్ కు ఓ షాక్ తగిలేలా కనిపిస్తోంది. వారి తొలి మ్యాచ్ కు స్టార్ ఆల్ రౌండర్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ మారథాన్ ఇన్నింగ్స్ .. 700 నిమిషాలు క్రీజులోనే
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ చెన్నై మొదటి మ్యాచ్ కు జట్టుతో చేరే పరిస్థితులు కనిపించడం లేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. మొయిన్ అలీ వీసా సమస్యతో సకాలంలో రాలేకపోతున్నట్లు తెలిపారు. ‘ఫిబ్రవరి 28నే ఇండియాకి వచ్చేందుకు మెయిన్ అలీ అప్లికేషన్ పెట్టుకున్నాడు. 20 రోజులు అయినా వీసా ప్రాసెస్లో కదలిక లేదు. మొయిన్ అలీ భారత్ కు తరచూ వస్తూనే ఉంటాడు. ఎప్పుడూ రాని వీసా సమస్య ఇప్పుడు రావడం ఏంటో అర్థం కాలేదు. మేం కూడా ఇంగ్లాండ్ లోని భారతీయ ఎంబసీతో మాట్లాడాం. వీసా ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని కోరాం. త్వరలోనే జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం.‘మొయిన్ అలీ వీసా సమస్యపై బీసీసీఐ కూడా ఆరా తీసింది. సోమవారం కల్లా అతని వీసా పేపర్లు అందుతాయని తెలిపారు. సోమవారం కల్లా ఇండియా చేరుకున్నా కూడా.. మూడు రోజులు క్వారంటైన్ లో గడపాల్సి ఉంటుంది. కాబట్టి మెయిన్ కోల్ కతాతో మ్యాచ్ కు దూరం కానున్నాడు’ అంటూ కాశీ విశ్వనాథన్ చెప్పారు. మొయిన్ అలీ లేకపోవడం చైన్నైకి మైనస్ కానుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.