క్రికెట్ అనేది మనకు ఆట కాదు ఎమోషన్. ఏ ఆటలో అయినా సరే గెలుపోటములు సహజం. అలా అని ప్రతిసారి కూడా మన జట్టే గెలవాలనుకుంటే అది కుదరకపోవచ్చు. గెలిస్తే ఎంతలా ఆనందపడతామో.. ఓడిపోయినప్పుడు కూడా దాన్ని అదే స్పూర్తితో తీసుకోవాలి. కానీ భారత జట్టు.. ఆసియాకప్ లోని సూపర్ 4 దశలో పాక్ తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కొందరు ఆకతాయిలు దాన్ని తీసుకోలేకపోయారు. శ్రుతిమించే పనిచేశారు. దీంతో ఏకంగా కేంద్రం కల్పించుకోవాల్సి వచ్చింది. సీరియస్ కూడా అయి వాళ్లకు సమన్లు కూడా జారీ చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. దుబాయి వేదికగా ఆసియాకప్ జరుగుతోంది. లీగ్ దశలో టీమిండియా.. పాకిస్థాన్, హాంకాంగ్ జట్లపై గెలిచింది. సూపర్ 4కి అర్హత సాధించింది. ఇక ఇందులో పాక్ తో మ్యాచ్ లో తడబడింది. చిన్న చిన్న తప్పిదాలు చేయడంతో మ్యాచుని చేజార్చుకుంది. దానికి తోడు మన ఆటగాడు అర్షదీప్ సింగ్.. ఒక క్యాచ్ వదిలేయడం అభిమానుల్ని బాగా నిరాశపరిచింది. దీంతో కోపం పట్టలేకపోయారు. ఓవైపు కోహ్లీతో పాటు పలువురు మాజీలు అర్షదీప్ కి మద్ధతు తెలపగా.. కొందరు ఆకతాయిలు మాత్రం శ్రుతిమించే పనులు చేస్తున్నారు. అతడిపై దాడి చేస్తామని, చంపేస్తామని సోషల్ మీడియా వేదికగా బెదిరిస్తున్నారు.
నిషేధిత సంస్థ ఖలీస్తాన్ తో సంబంధముందని తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా వికిపీడియాలో భారత్ బదులు ఖలీస్తాన్ అని ఎడిట్ చేశారు. దీంతో దుమారం చెలరేగింది. ఈ విషయంపై సీరియస్ అయిన కేంద్రం.. వికిపీడియా పేజిలో చోటు చేసుకున్న తప్పు సమాచారం మత సామరస్యం దెబ్బతింటుందని, అర్షదీప్ కుటుంబానికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వికిపీడియా భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేసింది. తప్పుడు సమాచారం ప్రచురితమైన విషయమై వివరణ ఇవ్వాలని కోరింది. ఇది జరిగిన 15 నిమిషాల్లోనే వికిపీడియా ఎడిటర్స్.. అర్షదీప్ ప్రొఫైల్ ని సరిచేశారు. ఈ వివాదం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: క్యాచ్ వదిలేసిన అర్షదీప్ పై జాత్యాంహకార దూషణలు.. అండగా హర్భజన్!
Catch drop by arshdeep singh 😭#arshdeepsingh #INDvPAK #INDvsPAK2022 pic.twitter.com/ttxabkCArI
— Girish Singh rajput (@GirishSinghraj3) September 4, 2022
Senior pro Virat Kohli backs youngster Arshdeep Singh, who had a volatile day at the field today#AsiaCup2022 #INDvsPAK #ViratKohli #ArshdeepSingh pic.twitter.com/FYPl5N4PMx
— OneCricket (@OneCricketApp) September 4, 2022
He is best in death overs , we can’t blame for his one match..
I stand with #arshdeepsingh #INDvsPAK2022 pic.twitter.com/pDkbYTrBWY— Karan Sandhu (@Karanbi03633746) September 5, 2022
Pakistan deep state has often used cricket to divide Indians & manipulate information. Several twitter accounts run by Pakistan ISPR pose as Indians. Beware. They did it against #MohammadShami & now #ArshadeepSingh. Don’t let them win. Pakistan wants to reignite Khalistan terror. pic.twitter.com/kQFjgHGjep
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 5, 2022