డెహ్రడూన్ లో క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్న కోచ్ నరేంద్ర షాపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. ఇతను ప్రస్తుతం భారత ఉమెన్స్ జట్టులో ప్లేయర్ గా ఉంటున్న స్పిన్నర్ స్నేహ రానా కోచ్ కావడం గమనార్హం.
ఎలాంటి రంగాల్లోనైనా సరే.. బాలికల మీద లైంగిక వేధింపులు మాత్రం ఆగట్లేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. ఎంత పెద్ద శిక్ష విధించినా ఈ సమస్య మాత్రం దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఇలాంటివి జరగడం చాలా విచారకరం. కొంతమంది మానవత్వం లేని మనుషుల వలన మొత్తం దేశానికే చెడ్డ పేరు వస్తోంది. మన దురదృష్టం కొద్ది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట.. మైనర్ బాలికలను వేధించే దుర్మార్గులు సమాజంలో ఉండనే ఉన్నారు. తాజాగా.. ఉత్తరాఖాండ్ లో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. అయితే ఈ సారి, స్కూల్లోనో, ఇంటిదగ్గరో కాదు ఒక క్రికెట్ అకాడమీలో.
అతని పేరు నరేంద్ర షా. అతను ఉత్తరాఖాండ్ క్రికెట్ సంఘంలో సభ్యుడుగా ఉంటూ.. డెహ్రడూన్ లో క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నాడు. మహిళలకు క్రికెట్ కోచింగ్ ఇవ్వడం ఇతని వృత్తి. అంతే కాదు ఇతను ప్రస్తుతం భారత ఉమెన్స్ జట్టులో ప్లేయర్ గా ఉంటున్న స్పిన్నర్ స్నేహ రానా కోచ్ కావడం గమనార్హం. చిన్నారులకి క్రికెట్ కోచింగ్ ఇవ్వాల్సిన ఇతను ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో చిక్కుకున్నాడు. వయసులో చాలా పెద్ద వాడైన నరేంద్ర షా ఇలాంటి పని చేయడం చాలా దారుణమైన విషయం. దీంతో పరువు పోయిందని గ్రహించిన నరేంద్ర ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. అసలేం జరిగిందంటే..
చిన్నప్పటినుంచే క్రికెట్ నేర్చుకోవాలనే ఆ బాలిక కలలు కనింది. కానీ ఆ కల వెనుక ఇంతటి కన్నీటి గాధ ఉందని ఎవరికీ తెలియలేదు. చదువుతో పాటుగా క్రికెట్ అకాడమీలో చేరి తన భవిష్యత్తుకు బాటలు వేసుకుంది. కానీ కోచ్ మాత్రం ఆ చిన్నారిపై కన్నేశాడు. బాలికకు పదే పదే ఫోన్ చేస్తూ లైంగికంగా వేధించేవాడు. అయితే.. ఇటీవలే ఆ బాలికతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో ఆధారం దొరకడంతో.. అతని మీద పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 506 తో పాటుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదయింది. దీనికి సంబంధించి నెహ్రు కాలనీ పోలీస్ ఇంఛార్జ్ కేంద్ర బహుగుణ వివరణ ఇచ్చాడు. నరేంద్రపై పోలీస్ కేసు నమోదైందని తెలుసుకున్న ఉత్తరాఖాండ్ క్రికెట్ సంఘం అతడిని పదవి నుంచి తొలగించింది.
Sex scandal storms Indian Women’s cricket as #SnehRana‘s coach sacked for using crude language
Check out #India #Cricket #CricketNews #WomensCricket #TeamIndia #viralpost https://t.co/8mlB2vjFeI— Sky11 (@sky11official) March 29, 2023