క్యాన్సర్‌తో బాధపడుతున్న జాకబ్ అనే ఓ చిన్నారి కోరికను పెద్ద మనసుతో తీర్చింది న్యూజిలాండ్ క్రికెట్ టీమ్. జాకబ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాకా క్రికెటర్ అవ్వాలనేది తన కల. కానీ విధి ఇంకోలా తలచింది. చిన్న వయసులోనే ఈ చిన్నారిని క్యాన్సర్ మహమ్మారి అవహించింది. ప్రస్తుతం చికిత్స పొందుతూ.. క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు జాకబ్. కాగా జాకబ్‌కు న్యూజిలాండ్ జట్టుతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవలనే కోరిక ఉంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు తెలిసి.. కివీస్ ఆటగాళ్లను సంప్రదిస్తే వాళ్లు సరే అన్నారు.
Great to have Jacob with us at Bay Oval today! @cmacca10 with the intro on @sparknzsport. #NZvBAN pic.twitter.com/pzjKe9Qzt6
— BLACKCAPS (@BLACKCAPS) January 1, 2022
ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ రెండో రోజు జాకబ్ న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోని మ్యాచ్ చూశాడు. దీంతో ఆ చిన్నారి సంతోషానికి అంతేలేదు. క్యాన్సర్‌తో పోరాటంలో ఈ చిన్ని ఆనందం ఆ చిన్నారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుందని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అలాగే చిన్నారి కోరికను తీర్చిన న్యూజిలాండ్ జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి న్యూజిలాండ్ జట్టు చేసిన ఈ మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.