క్రికెట్.. ఒక ఆటగానే కాదు, అంతకు మించిన ఓ ఎమోషన్ గా అభిమానుల్లో నాటుకుపోయింది. హోం గ్రౌండ్లో మ్యాచ్ ఉందంటే చాలు ఆఫీస్ లకు సెలవులు పెట్టి మరీ వెళ్లి చూసొస్తాం. ఇక వారి విజయాలను మన విజయంగా భావించి సంబరాలు జరుపుకుంటాం. ఆటగాళ్లలో సైతం ఇలా అవతలి ఆటగాడి విజయాన్ని తన విజయంగా భావించి సెలబ్రేషన్స్ చేసుకునే అలవాటు ఉన్నవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఒకడు. అవతలి ఎండ్ లో ఉన్న ప్లేయర్ సెంచరీ చేస్తే.. తానే చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతాడు రైనా. ఇప్పుడు అచ్చం అలానే చేస్తున్నాడు ఆసిస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్.
కామెరూన్ గ్రీన్.. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా వినిపిస్తోన్న పేరు. దానికి కారణం 2023 ఐపీఎల్ మినీ వేలంలో 17.5 కోట్లకు అమ్ముడుపోవడమే. ముంబై ఇండియన్స్ ఇంత భారీ ధరకు ఇతడిని కొనుగోలు చేయడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే అతడు అద్భుతమైన ఆల్ రౌండర్ అని అందరికి తెలిసిందే. ఇక గ్రీన్ దగ్గర ఉన్న మరో సలక్షణ ఏంటంటే? అతడి మంచి తనమే. అదేంటి అది అందరిలో ఉంటుందిగా అని మీరు అనుకోవచ్చు. కానీ అవతలి వాడి సంతోషాన్ని మన సంతోషంగా ఎంత మంది స్వీకరిస్తారు. అలా ఉండటం ఓ గొప్ప లక్షణం. ఆ లక్షణమే గతంలో టీమిండియా ఆటగాడు సురేష్ రైనాలో ఉంది. కోహ్లీ, ధోని లాంటి ఆటగాళ్లు సెంచరీ సాధిస్తే చాలు.. వారికంటే ముందే సెలబ్రేషన్స్ చేసుకుంటాడు రైనా. మళ్లీ ఇలా సెలబ్రేషన్స్ గ్రీన్ చేసుకుంటున్నాడు.
2020లోనే ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన గ్రీన్.. అతి కొద్ది కాలంలో వరల్డ్ క్లాస్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ లో కూడా సత్తా చూపడంలో అతడు సిద్దహస్తుడు. ఇక తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో 5 వికెట్లతో పాటుగా 51 పరుగులు కూడా చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే తన తోటి బ్యాటర్ అయిన అలెక్స్ కేరీ ఈ మ్యాచ్ లో సెంచరీ చేశాడు. అప్పుడు క్రీజ్ లో ఉన్న గ్రీన్.. కేరీ కంటే ముందుగానే అతడి సెంచరీ సెలబ్రేషన్స్ ను చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి సలక్షణం క్రీడల్లో చాలా అవసరం. జట్టులోకి వచ్చిన కొద్దికాలంలోనే గ్రీన్ ఓ నికార్సైన ఆల్ రౌండర్ గానే కాకుండా గొప్ప మనసున్న ఆటగాడిగా నిలుస్తున్నాడు. ఇలాంటి గుణం జట్టులో ఓ రకమైన ఉత్తేజాన్ని నింపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Cameron Green is a great team-man, celebrating the hundred of Carey before him. pic.twitter.com/pq8Ms6lKh5
— Johns. (@CricCrazyJohns) December 28, 2022