ఇంగ్లండ్‌లో పుట్టి ఇండియాలో ఒక మతంలా విస్తరించిన క్రికెట్ అంటే తెలియని దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. క్రికెట్ అంటే బలంగా వినిపించే దేశాలు వేళ్లపై లెక్కపెట్టవచ్చు. కానీ.. చాలా కాలం ఐసీసీ క్రికెట్‌ను అన్ని దేశాలకు విస్తరించాలనే ప్రయత్నాలు చేస్తునే ఉంది. ఇప్పటికే క్రికెట్ ఆడుతున్న దేశాల సంఖ్య వందకు పైనే ఉన్నాయి. తాజాగా మరో మూడు దేశాలు క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాయి. కంబోడియా, కోట్ డి ఐవరీ(Côte d’Ivoire), ఉజ్బెకిస్థాన్ దేశాలు ఐసీసీలో సభ్యులుగా చేరాయి.
ఈ విషయాన్ని ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ‘వెల్‌కమ్ టూ ది ఐసీసీ’ అంటూ ఈ మూడు దేశాలను అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలోకి ఆహ్వానించింది. ఈ మూడు దేశాలతో కలిపి ఐసీసీలో సభ్యత్వాం పొందిన దేశాల సంఖ్య 108కి చేరింది. ఇందులో 96 అసోసియేట్ దేశాలు ఉన్నాయి. కాగా కంబోడియా, ఉజ్బెకిస్థాన్ దేశాలు ఆసియా ఖండంలో ఉండగా.. కోట్ డి ఐవరీ వెస్ట్ ఆఫ్రికాలో ఉంది.
ఐసీసీలో సభ్యత్వం పొందేందుకు.. ఆయా దేశాలు ముందుగా దేశవాళీ క్రికెట్‌ను ప్రొత్సహించాలి. ఒక నిర్ధిష్టమైన స్టక్చర్‌ను ఏర్పాటు చేసి టీ20, వన్డేల మ్యాచ్‌లను నిర్వహించాలి. అలాగే జూనియర్, ఉమెన్స్ టీమ్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి. ఇలా దేశవాళ్లీ క్రికెట్‌ను ఒక పద్దతి ప్రకారం నిర్వహించుకుంటూ.. అప్పుడు ఐసీసీలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అన్ని సవ్యంగా ఉన్నాయని ఐసీసీ భావిస్తే సభ్యత్వం ఇస్తుంది. కాగా.. క్రికెట్‌ను ప్రొత్సహించేందుకు ఏ దేశం ముందుకు వచ్చినా.. ఆ దేశంలో క్రికెట్ అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలను ఐసీసీ అందిస్తుంది. మరి క్రికెట్‌లోకి మూడు కొత్త దేశాల ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The ICC family grows to 108 countries 🙌
More about the three new members ➡️ https://t.co/aevITTFjtn pic.twitter.com/vEzDuNYnuK
— ICC (@ICC) July 27, 2022