సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా బ్యాట్‌తో మ్యాజిక్ చేశాడు. సోమవారం ప్రారంభమైన మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే అవుట్ అయింది. ఇన్నింగ్స్ చివర్లో బుమ్రా ఒక భారీ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. రబాడా వేసిని ఇన్నింగ్స్ 62వ ఓవర్లో బుమ్రా భారీ సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ సిక్స్‌ని చూసి స్టాండ్స్‌లో కూర్చున్న అతని భార్య సంజనా గణేశన్ కూడా ఆశ్చర్యపోయారు. ఆమె నవ్వుతూ, చప్పట్లు కొడుతూ కనిపించారు.
— Lodu_Lalit (@LoduLal02410635) January 3, 2022
బుమ్రా సిక్స్‌పై సంజన స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మంచి ప్రదర్శన చేసినప్పుడు వారి సతీమణులు ఇచ్చిన రియాక్షన్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. ఇప్పుడు తాజాగా బుమ్రా భార్య సిక్స్‌ను సెలబ్రెట్ చేసుకున్న విధానం నెట్టింట వైరల్ అవుతోంది. మరి సంజనా రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.